STOCKS

News


కొత్త నిబంధనలకు గడువు పొడిగించండి..

Saturday 5th January 2019
news_main1546684375.png-23425

  • కేంద్రాన్ని కోరనున్న ఈ కామర్స్ సంస్థలు

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి కొత్త నిబంధనల అమలుకు గడువును పొడిగించాలంటూ బడా ఈ కామర్స్ సంస్థలు.. కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. మార్పులు అమలు చేసేందుకు కనీసం 4- 5 నెలలు పడుతుందని, కాబట్టి అంత వరకూ సమయం ఇవ్వాలని అభ్యర్థించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల అమలుకు తగ్గట్లుగా వ్యాపార విధానాలు మార్చుకునేందుకు, ప్రస్తుతం వివిధ సంస్థలతో ఉన్న భాగస్వామ్య ఒప్పందాలను సవరించుకునేందుకు కొంత సమయం కావాల్సి ఉంటుందని.. కానీ డిసెంబర్ 26న చేసిన ప్రకటనతో తమకు కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చినట్లయిందని ఈ- కామర్స్ కంపెనీకి చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అందుకే గడువు పొడిగించాలంటూ కేంద్రాన్ని కోరాలని ఈ-కామర్స్ సంస్థలు భావిస్తున్నట్లు చెప్పారు. ఇటీవలి సవరణలను కంపెనీలు అధ్యయనం చేస్తున్నామని, వీటిపై రాబోయే వారాల్లో కేంద్రాన్ని సంప్రతించే అవకాశం ఉందని మరో అధికారి పేర్కొన్నారు.
కొత్త నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడులు గల ఈ కామర్స్ సంస్థలు.. తమకు వాటాలున్న ఇతర సంస్థల ఉత్పత్తులను సొంత పోర్టల్‌లో విక్రయించడానికి లేదు. అలాగే, ఏ విక్రేత కూడా తన వద్దనున్న మొత్తం నిల్వల్లో 25 శాతానికి మించి .. ఈ కామర్స్ పోర్టల్‌లో విక్రయించకూడదు. ఒకవేళ నిర్దేశిత స్థాయిని మించిన పక్షంలో ఈ కామర్స్ సంస్థే వాటిని కొనుగోలు చేసి, నిల్వ చేస్తోందని భావించాల్సి ఉంటుంది. ఫలితంగా ఇన్వెంటరీ ఆధారిత రిటైల్ సంస్థల్లో ఎఫ్‌డీఐలకు అనుమతి లేదన్న నిబంధనను ఉల్లంఘించినట్లవుతుంది. అయితే, 25 శాతం నిబంధనపై మరింత స్పష్టత అవసరమని ఈ-కామర్స్ వర్గాలు అంటున్నాయి. విక్రేతలు తమ ఖాతాల వివరాలను ఈ-కామర్స్ సంస్థలతో పంచుకునేందుకు ఇష్టపడని పక్షంలో వారు కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారో లేదో తెలుసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నాయి.



You may be interested

మోదీ మంత్రం వినిపించడంలేదు!

Saturday 5th January 2019

మార్కెట్‌కు సుస్థిర ప్రభుత్వం కావాలి అంబరీశ్‌ బాలిగా గత ఎన్నికల సందర్భంగా కనిపించిన మోదీ మాయాజాలం ఈ దఫా కనిపించడంలేదని మార్కెట్‌ నిపుణుడు అంబరీశ్‌ బాలిగా చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ బాగా పుంజుకుందన్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సుస్థిర ప్రభుత్వం ఏర్పడడమే మార్కెట్లకు కావాలన్నారు. కొత్త ఏడాదిపై తాను పాజిటివ్‌గా ఉన్నానని, కొత్త ప్రభుత్వం ఎకానమీకి మద్దతుగా నిలుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో

మరో 3 నెలల్లో విమానాల్లో మొబైల్‌ మాటలు

Saturday 5th January 2019

విమానాల్లో, ఓడల్లో మరో మూడు నెలల్లో మొబైల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో మొబైల్‌ వినియోగానికి సంబంధించి విధివిధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఒక మంత్రుల బృందాన్ని ఏర్పరిచింది. ఈ బృందం ఇకపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమయి ఇందుకు సంబంధించిన అడ్డంకులు, కావాల్సిన అనుమతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనెక్టివిటీకి కావాల్సిన సేవలు తదితర అంశాలను చర్చించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి వైమానిక, షిప్పింగ్‌, టెలికం రంగాలకు చెందిన కంపెనీలు, ప్రభుత్వ

Most from this category