STOCKS

News


మార్కెట్లోకి నూతన ‘వ్యాగన్‌ఆర్‌’

Thursday 24th January 2019
news_main1548303817.png-23766

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. తన వ్యాగన్‌-ఆర్‌ శ్రేణిలో నూతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారును ‘బిగ్ న్యూ వ్యాగన్ఆర్’గా అభివర్ణించిన సంస్థ.. 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు మరో ఆప్షన్లో భాగంగా 1-లీటర్ ఇంజిన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. 1.2 లీటర్‌ ఇంజిన్‌ కారు ధరల శ్రేణి రూ.4.89లక్షలు–రూ.5.69 లక్షలు. 1-లీటర్ ఇంజిన్‌ ధరల శ్రేణి రూ.4.19 లక్షలు–రూ.4.69 లక్షలు కాగా, ఈ విభాగంలోని ఆటోమేటెడ్‌ గేర్‌ షిఫ్ట్‌ ధర రూ.5.16 లక్షలు. ఐదవ తరం హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫాపై అభివృద్ధి చెందిన ఈ కారు.. మునుపటి తరాల కంటే మరింత సురక్షితంగా ఉంటుందని కంపెనీ తెలియజేసింది. హై టెన్షన్ స్టీలును వాడడం వల్ల నూతన వేరియంట్లో శబ్దం, కుదుపులు తక్కువగా ఉంటాయని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ కెనిచి అయుకవా మాట్లాడుతూ.. ‘ఈ కారు కేవలం ఫ్యామిలీనే కాకుండా, యువ కొనుగోలుదారులను కూడా మంచి ఛాయిస్‌ కానుంది.’ అని వ్యాఖ్యానించారు.
జీఎస్‌టీ గణనీయంగా తగ్గాలి..
ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై 28 శాతం జీఎస్‌టీ రేటు, ఇందుకు అధనంగా 15 శాతం సెస్‌ అమల్లోఉండగా.. వీటిని తగ్గాల్సిన అవసరం ఉందని కెనిచి అయుకవా అన్నారు. జీఎస్‌టీ తగ్గడం వల్ల పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.



You may be interested

'ఇండిగో'కు ఇంధన ధరల సెగ..

Thursday 24th January 2019

- క్యూ3లో లాభం 75 శాతం డౌన్‌ న్యూఢిల్లీ: ఇంధన ధరలు పెరిగిపోవడం, కరెన్సీ మారకం విలువ తగ్గడం విమానయాన సంస్థ ఇండిగో లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నికర లాభం ఏకంగా 75 శాతం క్షీణించి రూ.191 కోట్లకు పడిపోయింది. 2017-18 క్యూ3లో ఇండిగో రూ.762 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఇండిగో

టాటా ‘హారియర్‌’ వచ్చేసింది

Thursday 24th January 2019

 ప్రారంభ ధర రూ.12.69 లక్షలు ముంబై: కారు ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాటా హారియర్‌’ బుధవారం దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ల్యాండ్‌ రోవర్‌ డీ8 ప్లాట్‌ఫాంపై రూపొందిన ఈ సరికొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ).. మొత్తం 4 వేరియంట్లలో లభ్యమవుతోంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌, సింగిల్ పవర్‌ట్రెయిన్ ఈ కారు ప్రధాన ఫీచర్లు. ‘ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్‌’ మోడళ్లను

Most from this category