STOCKS

News


నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలిపిన హాత్‌వే

Friday 7th September 2018
news_main1536295612.png-20034

హైదరాబాద్‌: ప్రముఖ కేబుల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థ హాత్‌వే, నెట్‌ఫ్లిక్స్‌ చేతులు కలిపాయి. హాత్‌వే సెట్‌టాప్‌ బాక్స్‌ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ పేరుతో ప్రత్యేక బటన్‌ను ఏర్పాటు చేసినట్టు, ఈ ఒక్క బటన్‌ను ప్రెస్‌ చేయడం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ కార్యక్రమాలను వీక్షించే అవకాశం కలుగుతుందని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించిన చార్జీలను హాత్‌వే నెలవారీ కేబుల్‌ బిల్లుతో పాటు చెల్లించొచ్చు. ప్రారంభ ధరగా సెట్‌టాప్‌ బాక్స్‌ను రూ.2,999కే అందిస్తున్నట్టు హాత్‌వే తెలిపింది. హాత్‌వే బ్రాడ్‌బ్యాండ్‌ ప్రస్తుత వినియోగదారులతోపాటు, కొత్త వారు నెట్‌ఫ్లిక్స్‌కు సబ్‌స్క్రయిబ్‌ చేసుకుంటే సెట్‌టాప్‌ బాక్స్‌ ఉచితమని పేర్కొంది. 
 



You may be interested

బడా కంపెనీలూ ఆన్‌‘లైనే’

Friday 7th September 2018

చెన్నై: ఇప్పటిదాకా చిన్నా చితకా బ్రాండ్లు, స్మార్ట్‌ఫోన్ల వంటి ఉత్పత్తులకు మాత్రమే పరిమితమైన ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ పోర్టల్స్‌ వైపు ఇప్పుడు బడా కంపెనీలు కూడా చూస్తున్నాయి. నెస్లే, శాంసంగ్‌ మొదలుకుని మారికో, హిందుస్తాన్‌ యూనిలీవర్‌ వంటి సంస్థల దాకా ఆన్‌లైన్‌ బాట పడుతున్నాయి. ఆహారోత్పత్తుల నుంచి సౌందర్య సాధనాలు, లక్షల రూపాయల ఖరీదు చేసే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల బ్రాండ్స్‌ను కూడా ఆవిష్కరిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా ఇటీవలే తమ

అత్యంత విలువైన బ్రాండ్‌గా మరోసారి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

Friday 7th September 2018

ముంబై: దేశంలో అత్యంత విలువైన టాప్‌ బ్రాండ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మరోసారి గుర్తింపు దక్కించుకుంది. బ్రాండ్జ్‌ ఇండియా టాప్‌ 50లో మొదటి స్థానాన్ని వరుసగా ఐదో ఏడాది సొంతం చేసుకుంది. ‘డబ్ల్యూపీపీ అండ్‌ కంతర్‌ మిల్‌వర్డ్‌ బ్రౌన్స్‌’ బ్రాండ్జ్‌ నివేదిక ప్రకారం... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్‌ విలువ 21 శాతం వృద్ధి చెంది 2018లో 21.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. బ్యాంకు శాఖల ద్వారా 175 డాలర్ల చిన్న రుణాలను

Most from this category