STOCKS

News


జాన్సన్‌ అండ్ జాన్సన్‌కు 4.7 బిలియన్ డాలర్ల జరిమానా

Friday 13th July 2018
news_main1531502951.png-18296

సెయింట్ లూయీ (అమెరికా): బేబీ టాల్కం పౌడర్లో ఆస్‌బెస్టాస్‌ అవశేషాల వివాదంలో దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కి (జేఅండ్‌జే) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్ వాడటం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడిన 22 మంది బాధిత మహిళలు, వారి కుటుంబాలకు 4.7 బిలియన్ డాలర్ల మేర పరిహారం చెల్లించాలంటూ సెయింట్ లూయీ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా జేఅండ్‌జే తయారు చేసే బేబీ పౌడర్‌, షవర్‌ టు షవర్ ఉత్పత్తుల్లో ప్రధానంగా ప్రమాదకమైన ఆస్‌బెస్టాస్‌ అవశేషాలు ఉన్న సంగతి వాస్తవమేనని వైద్య నిపుణులు వాంగ్మూలం ఇచ్చారు. పలువురు బాధిత మహిళల అండాశయ కణాల్లో ఆస్‌బెస్టాస్ ఫైబర్‌, టాల్కం పౌడర్ రేణువులు కనిపించినట్లు తెలిపారు. అయితే, కోర్టు తీర్పుపై జేఅండ్‌జే అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు తమ ఏ ఉత్పత్తిలోనూ ఆస్‌బెస్టాస్‌ వినియోగం ఉండదని స్పష్టం చేసింది. విచారణంతా పక్షపాత ధోరణితో నడిచిందని, కోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని వివరించింది. మొత్తం మీద 9,000 మంది పైచిలుకు మహిళలు కంపెనీపై దావా వేశారు. 



You may be interested

ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీ

Friday 13th July 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించారు. అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మాను వెనక్కునెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ధర శుక్రవారం 1.6 శాతం పెరిగి రూ.1,099.80 ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరింది. దీంతో అంబానీ సంపద 44.3 బిలియన్‌ డాలర్లకు పెరిగి ఉంటుందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ పేర్కొంది. జాక్‌ మా సంపద విలువ 44 బిలియన్‌

ఎగుమతులు 18 శాతం అప్‌

Friday 13th July 2018

న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జూన్‌లో 17.57 శాతం పెరిగి 27.7 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, అదే సమయంలో అధిక ముడి చమురు రేట్ల కారణంగా దిగుమతుల భారం పెరిగి.. వాణిజ్య లోటు మూడున్నరేళ్ల గరిష్ట స్థాయి 16.6 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఈ స్థాయికి ఎగియడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇది 16.86 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక గతేడాది జూన్‌లో

Most from this category