STOCKS

News


పీఎన్‌బీ నిర్వహణ ఎన్‌సీఆర్‌ చేతికి

Thursday 29th November 2018
news_main1543470755.png-22479

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నిర్వహణ బాధ్యత ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ దక్కించుకుంది. మూడేళ్ల అగ్రిమెంట్‌లో పీఎన్‌బీ నగదు నిర్వహణ, కంటెంట్‌ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్‌ జర్నల్‌ పుల్లింగ్, సైట్‌ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి అన్ని రకాల సేవలందిస్తామని ఎన్‌సీఆర్‌ ఇండియా ఎండీ నఫ్‌రోజ్‌ దస్తూర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పీఎన్‌బీకి దేశంలో 6,692 బ్రాంచీలు, 3600 ఏటీఎంలు, 10 కోట్ల మంది కస్టమర్లు, 4 కోట్ల డెబిట్‌ కార్డుదారులున్నారు.
 You may be interested

50%పైగా రాబడి అందించే స్టాక్స్‌!!

Thursday 29th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం..  అరబిందో ఫార్మా అరబిందో ఫార్మాపై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,270గా నిర్ణయించాం. అంటే 60 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌ ఉంది. కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలు మించాయి. వార్షికంగా విక్రయాలు 7 శాతం పెరిగాయి. అయితే ఇదే సమయంలో మార్జిన్లు 21.6 శాతానికి తగ్గితే, నికర లాభం 18 శాతంమేర క్షీణించింది. గత

సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఎఫ్‌పీఓ @ రూ.17,000 కోట్లు

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌కు మంచి స్పందన లభించింది. వచ్చిన సబ్‌స్క్రిప్షన్‌లో రూ.17,000 కోట్ల వరకూ ప్రభుత్వం అంగీకరించే అవకాశాలున్నాయి.  సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఫాలోఆన్‌ ఆఫర్‌ (నాలుగో దఫా)ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  అదనంగా సబ్‌స్క్రిప్షన్‌ వస్తే, మరో రూ.6,000 కోట్లు,.... మొత్తం రూ.14,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. ఈ ఎఫ్‌పీఓ మంగళవారం మొదలై బుధవారం ముగిసింది. మొదటి

Most from this category