STOCKS

News


ఎన్‌సీఎల్‌టీలో రుయాలకు చుక్కెదురు

Wednesday 30th January 2019
news_main1548824195.png-23893

  • ఎస్సార్‌ స్టీల్‌ రుణాలను తీర్చివేస్తామన్న పిటిషన్‌ తిరస్కరణ

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ రుణ బకాయిలను తీర్చివేస్తామంటూ రుయా కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అహ్మదాబాద్‌ బెంచ్‌ తిరస్కరించింది. ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్ల ప్రణాళికను ఆమోదించొద్దన్న రుణదాతల అభ్యర్థన చట్టవిరుద్ధం కాదని ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. దీంతో ఎస్సార్‌ స్టీల్‌ను కాపాడుకోవాలన్న రుయాల ‍ప్రయత్నాలకు చుక్కెదురు అయింది. అదే సమయంలో ఎస్సార్‌ స్టీల్‌ను విక్రయించడం ద్వారా రుణ బకాయిలను తీర్చుకోవాలన్న రుణదాతల ప్రయత్నాలకు ఊతం లభించింది. ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు ఆర్సెలర్‌ మిట్టల్‌ వేసిన రూ.42,000 కోట్ల బిడ్‌కు రుణదాతల కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బ్యాంకులకు రూ.50,800 కోట్ల బకాయిలను కంపెనీ చెల్లించాల్సి ఉండడంతో, వీటిని రాబట్టుకునేందుకు దివాల పరిష్కార చట్టం కింద చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రూ.54,389 కోట్లను చెల్లించేందుకు తాము ఆఫర్‌ ఇచ్చామని, రుణదాతలకు ఇదే అత్యధిక చెల్లింపు ప్రతిపాదన అని ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్లు ఎన్‌సీఎల్‌టీకి తెలిపారు. ‘‘ఐబీసీలో ఇటీవలే ప్రవేశపెట్టిన సెక్షన్‌ 12ఏ కింద మా ప్రతిపాదన సమర్పించాం. అలాగే, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు సైతం ఈ సెక్షన్‌ వర్తిస్తుందని స్పష్టం చేస్తోంది’’ అని ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఎన్‌సీఎల్‌టీ పూర్తి తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఎన్‌సీఎల్‌టీ తీర్పు ఐబీసీ సమగ్రతను కాపాడేలా ఉందని, నిబంధనల ఆధారంగా చట్టం పనిచేస్తుందని భరోసా ఇచ్చినట్టయిందని ఆర్సెలర్‌ మిట్టల్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎస్సార్‌ స్టీల్‌ ఇండియా, భారత్‌కు కూడా ఇది సానుకూల పరిణామమని, ఈ కేసులో సత్వర పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీలు క్యూ3 ఫలితాలు

Wednesday 30th January 2019

బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం 54% జంప్‌ న్యూఢిల్లీ: నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగానికి చెందిన బజాజ్‌ ఫైనాన్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ3 ఫలితాలను ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఆశాజనక త్రైమాసిక ఫలితాలను నమోదు చేసింది. గడేడాది మూడో త్రైమాసిక కాలంలో నికర లాభం రూ.690 కోట్లు కాగా, తాజా క్యూ3లో రూ.1,060 కోట్లను ఆర్జించి.. ఏకంగా 54 శాతం వృద్ధిరేటును సాధించింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 48

జెట్‌లో బ్యాంకులకు వాటా

Wednesday 30th January 2019

రుణాలను వాటాగా మార్చడానికి...! మరికొన్ని ప్రతిపాదనలకు  ఆమోదం కోసం న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌) వచ్చే నెల 21న జరగనున్నది. ఈ ఈజీఎమ్‌లో రుణాలను ఈక్విటీగా మార్చడం, ఆధీకృత మూలధనం పెంపు, తదితర ప్రతిపాదనలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ వాటాదారుల ఆమోదం కోరనున్నది. నిధుల సమస్య తీవ్రంగా ఉండటంతో రుణదాతలు ఇచ్చిన రుణాలను మొత్తంగా గానీ, పాక్షికంగా గానీ ఈక్విటీగా గానీ, కన్వర్టబుల్‌ డిబెంచర్లుగా గానీ  లేదా ఇతర సెక్యూరిటీలగా

Most from this category