News


‘నాగార్జున ఆయిల్‌’ ఆస్తుల అమ్మకం

Thursday 13th December 2018
news_main1544677014.png-22878

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నాగార్జున ఆయిల్‌ రిఫైనరీకి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌టీ) ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అనుబంధ కంపెనీ అయిన నాగార్జున ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌వోసీఎల్‌) ఆస్తులను విక్రయించాల్సిందిగా (లిక్విడేషన్‌) ఎన్‌సీఎల్‌టీ చెన్నై బెంచ్‌ తీర్పు వెలువరించింది. ఎన్‌వోసీఎల్‌కు మొత్తం రూ.9,000 కోట్ల అప్పులున్నాయి. ఇందులో 15 బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.8,000 కోట్లు. హల్దియా పెట్రోకెమికల్స్‌, గల్ఫ్‌ పెట్రోకెమికల్స్‌లు ఇప్పటికే పరిష్కార ప్రణాళికతో ముందుకొచ్చాయి. అయితే కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ (సీవోసీ) నిర్ణయించిన రూ.1,450 కోట్ల లిక్విడేషన్‌ విలువ కంటే ఇవి తక్కువగా బిడ్‌ చేయడంతో వీటి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 



You may be interested

పట్టణీకరణ వినూత్నంగా ఉండాలి: అమితాబ్‌ కాంత్‌

Thursday 13th December 2018

న్యూఢిల్లీ: దేశంలో పట్టణీకరణ చాలా వినూత్నంగా, ఎల్లకాలం నిలిచేలా ఉండాలని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ చెప్పారు. పాశ్చాత్య సమాజంలో మాదిరిగా పట్టణీకరణలో తప్పులకు అవకాశం ఇవ్వరాదని చెప్పారాయన. ‘‘భూమిపై 3 శాతం స్థలంలోనే పట్టణాలు విస్తరించి ఉన్నాయి. కానీ, ప్రపంచ జీడీపీలో వీటి వాటా 84 శాతంగా ఉంది’’ అని కాంత్‌ చెప్పారు. ‘ఐటీసీ సస్టెయిన్‌బిలిటీ అవార్డ్స్‌ 2018’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు

స్టార్టప్‌ నిబంధనలు సరళీకరించిన సెబీ

Thursday 13th December 2018

ముంబై: పలు సంస్కరణల్లో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టార్టప్‌ల అభివృద్ధి కోసం స్టార్టప్‌ల లిస్టింగ్‌ నిబంధనలను సరళీకరించింది. పెట్టుబడుల రాబడుల రక్షణ కోసం ఒత్తిడి ఆస్తులను విడగొట్టే వెసులుబాటును మ్యూచువల్‌ ఫం‍డ్స్‌కు కల్పించింది. లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రమోటర్లు తమ వాటాను తగ్గించుకోవడానికి ఉపయోగించుకునే ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానాన్ని మరింతగా విస్తరించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సంబంధించిన పెట్టుబడుల పరిమితి

Most from this category