STOCKS

News


మల్వీందర్‌, గోధ్వానీకి ఎన్‌సీఎల్‌టీ నోటీసులు

Friday 7th September 2018
news_main1536296381.png-20043

న్యూఢిల్లీ: ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌ ఎండీ మల్వీందర్‌ సింగ్‌, రెలిగేర్‌ మాజీ చీఫ్ సునీల్ గోధ్వానీ తదితరులకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నోటీసులు జారీ చేసింది. కంపెనీ షేర్‌హోల్డింగ్‌, బోర్డు వ్యవహారాల్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్ లావాదేవీల్లో మల్వీందర్‌ సింగ్ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన సోదరుడు శివీందర్ సింగ్ వేసిన పిటీషన్‌పై విచారణలో భాగంగా ఎన్‌సీఎల్‌టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌ రికార్డులను తనిఖీ చేసేందుకు, అవసరమైన పత్రాల ఫొటోకాపీలు తీసుకునేందుకు శివీందర్‌ సింగ్‌, ఆయన భార్య అదితి సింగ్‌తో పాటు మల్వీందర్‌ సింగ్‌లకు అనుమతులిచ్చింది.  పది రోజుల్లోగా తమ సమాధానాలు తెలియజేయాలంటూ మల్వీందర్‌ సింగ్‌ తదితరులకు ట్రిబ్యునల్ ఆదేశించింది. అలాగే శివీందర్ సింగ్ కూడా రెండు వారాల్లోగా రిజాయిండర్‌ దాఖలు చేయాలంటూ సూచించింది. తదుపరి విచారణను ‍అక్టోబర్ 9కి వాయిదా వేసింది. కుటుంబ వ్యాపారాల నిర్వహణలో మల్వీందర్‌ సింగ్ అవకతవకలకు పాల్పడ్డారని, సంస్థలను అప్పుల్లో ముంచేశారని ఆరోపిస్తూ ఆయన తమ్ముడు శివీందర్‌ సింగ్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 



You may be interested

మధ్యప్రదేశ్‌లో ఓఎన్‌జీసీకి చమురు, గ్యాస్ నిక్షేపాలు

Friday 7th September 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) తాజాగా మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో రెండు చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. మధ్యప్రదేశ్‌లోని వింధ్యన్ బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నట్లు, దాదాపు 3,000 పైచిలుకు మీటర్ల లోతున పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ (ఎక్స్‌ప్లొరేషన్‌) అజయ్ కుమార్ ద్వివేది చెప్పారు. ఇప్పటికే నాలుగు బావులు తవ్వినట్లు, ఈ ఏడాది ఆఖరు నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే

మల్వీందర్‌, గోధ్వానీకి ఎన్‌సీఎల్‌టీ నోటీసులు

Friday 7th September 2018

న్యూఢిల్లీ: ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌ ఎండీ మల్వీందర్‌ సింగ్‌, రెలిగేర్‌ మాజీ చీఫ్ సునీల్ గోధ్వానీ తదితరులకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నోటీసులు జారీ చేసింది. కంపెనీ షేర్‌హోల్డింగ్‌, బోర్డు వ్యవహారాల్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్ లావాదేవీల్లో మల్వీందర్‌ సింగ్ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన సోదరుడు శివీందర్ సింగ్ వేసిన పిటీషన్‌పై విచారణలో భాగంగా ఎన్‌సీఎల్‌టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Most from this category