STOCKS

News


ఆర్‌హెచ్‌సీ దివాలా పిటీషన్‌కు ఎన్‌సీఎల్‌టీ నో..

Friday 7th December 2018
news_main1544161263.png-22719

న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్‌పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ హెచ్‌డీఎఫ్‌సీ దాఖలు చేసిన పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) తోసిపుచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీలు దివాలా చట్ట (ఐబీసీ) పరిధిలోకి రావని పేర్కొంది. ఒకప్పటి ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ ప్రమోటర్లు మల్వీందర్‌ మోహన్‌ సింగ్‌, శివీందర్ సింగ్‌ ప్రమోట్ చేసిన సంస్థ ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌. 2016 ఏప్రిల్‌లో ఇది హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రూ.200 కోట్ల రుణం తీసుకుంది. తొలి త్రైమాసికంలో వడ్డీ సక్రమంగానే కట్టినప్పటికీ ఆ తర్వాత నుంచి చెల్లించడం మానేసింది. ఆ సంస్థ తనఖా పెట్టిన షేర్లను విక్రయించినప్పటికీ ఇంకా రూ.41 కోట్లు రావాల్సి ఉన్నట్లు తేలింది. ఈ బకాయిలు రాబట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే హెచ్‌డీఎఫ్‌సీ తాజా పిటీషన్ వేసింది.



You may be interested

రూ. 518 లక్షల కోట్లకు వ్యక్తిగత సంపద

Friday 7th December 2018

హైదరాబాద్‌: వచ్చే అయిదేళ్ల వ్యవధిలో దేశీయంగా వ్యక్తుల దగ్గరుండే మొత్తం సంపద ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.518 లక్షల కోట్లకు చేరనుంది. డైరెక్ట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌ ఈ సంపద వృద్ధికి తోడ్పడనున్నాయి. వచ్చే అయిదేళ్లలో ఈ రెండూ 24.41 శాతం, 21.04 శాతం మేర వృద్ధి చెందనున్నట్లు కార్వీ ప్రైవేట్ వెల్త్ సంస్థ 'ఇండియా వెల్త్ రిపోర్ట్ 2018'

అమెరికాలో ఇన్ఫోసిస్‌ కొత్త టెక్నాలజీ హబ్‌

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అమెరికాలో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాలోని హార్డ్‌ఫోర్డ్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఇన్ఫోసిస్‌ తెలిపింది. గత 18 నెలల్లో మొత్తం 7,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చామని పేర్కొంది. ఈ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు కీలకమైన మైలురాయని ఇన్ఫోసిస్‌ సీఓఓ యూబీ ప్రవీణ్‌ రావు తెలిపారు. 

Most from this category