STOCKS

News


అమరావతితో ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌!

Saturday 9th March 2019
news_main1552116021.png-24506

  • మరొకటి ఇండోర్‌లో...

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బెంచ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు కేం‍ద్రం ఆమోదముద్ర వేసింది. కేసుల భారం ప్రత్యేకించి ఐబీసీ (ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ) 2016  కింద వివాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఈ బెంచ్‌ల ఏర్పాటుతో కేసుల సత్వర పరిష్కారం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ వివాదాలు అమరావతి బెంచ్‌ న్యాయపరిధిలోకి వస్తుండగా, మధ్యప్రదేశ్‌లోని దివాలా అంశాల న్యాయపరిధి ఇండోర్‌ బెంచ్‌ పరిధిలోకి వస్తుంది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ వివాదాలు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ పరిధిలోకి వెళుతుండగా, మధ్యప్రదేశ్‌కు సంబంధించి దివాలా వివాదాలు అహ్మదాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ పరిధిలోకి వస్తున్నాయి. కంపెనీల చట్టం, 2013 కింద ఏర్పాటయిన ఎన్‌సీఎల్‌టీ.... కంపెనీల చట్టం, ఐబీసీ, ఎల్‌ఎల్‌పీ యాక్ట్‌, 2008 పరిధిలోకి వచ్చే వివాదాలను నిర్దిష్ట కాలపరిమితితో, సమర్ధవంతమైన రీతిలో పరిష్కరిస్తోంది. న్యూఢిల్లీలోని ప్రధాన బెంచ్‌ సహా దేశంలో ప్రస్తుతం 14 ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌లు ఉన్నాయి. 



You may be interested

రిలయన్స్‌ ట్రెండ్స్‌ భారీ విస్తరణ!

Saturday 9th March 2019

వచ్చే ఐదేళ్లలో స్టోర్ల సంఖ్య 2,500కు  ఈ కామర్స్‌లోనూ పెద్ద ఎత్తున విస్తరణ  రిలయన్స్‌ రిటైల్‌ ప్రణాళికలు ముంబై: ‘రిలయన్స్‌ ట్రెండ్స్‌’ భారీ విస్తరణకు రిలయన్స్‌ రిటైల్‌ సిద్ధమైంది. ప్రస్తుతం 557గా ఉన్న ఔట్‌లెట్లను వచ్చే ఐదేళ్లలో 2,500కు పెంచాలని, ఈ కామర్స్‌తోనూ అనుసంధానించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త ఈ కామర్స్‌ విధానం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలకు ప్రతికూలంగా ఉండడంతో... ఈ కామర్స్‌ విభాగంలో ఫ్యాషన్‌ పరంగా విస్తరించేందుకు ఇది అనుకూల సమయమని

ఎస్సార్‌ స్టీల్‌పై ఆర్సెలర్‌ మిట్టల్‌కు లైన్‌క్లియర్‌?

Saturday 9th March 2019

న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు చేసే విషయంలో ఆర్సెలర్‌ మిట్టల్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) పచ్చజెండా ఊపింది. 2017 నుంచి ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కింది. పెద్ద ఎత్తున రుణాలను తీర్చలేక దివాలా పరిష్కార ప్రక్రియకు కిందకు వెళ్లిన ఎస్సార్‌ స్టీల్‌ను రూ.42,000 కోట్లకు కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరిస్తూ ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌ సమర్పించింది. దీనికి

Most from this category