STOCKS

News


అమ్మ కోరిక... పిటిషన్‌ ఉపసంహరణ

Saturday 15th September 2018
news_main1536987430.png-20273

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్‌ శివిందర్‌ మోహన్‌ సింగ్‌... తన అన్న మల్వీందర్‌ మోహన్‌ సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. రెలిగేర్‌ మాజీ అధినేత సునీల్‌ గో‍ధ్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్‌ను కూడా ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. తమ మధ్య ఉన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కోరారని, వారి కోరిక మేరకు ఈ పిటీషన్లను వెనక్కి తీసుకుంటున్నానని శివిందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ పిటీషన్ల ఉపసంహరణకు అనుమతించినందుకు ఆయన ఎన్‌సీఎల్‌టీకి ధన్యవాదాలు తెలిపారు.



You may be interested

సెల్‌ఫోన్‌ దిగుమతుల నిబంధనల్లో సడలింపు

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: మొబైల్‌ హాండ్‌సెట్స్‌ దిగుమతులు మరింత పెరిగే దిశగా టెలికం మంత్రిత్వ శాఖ‌ (డీఓటీ) నిర్ణయం తీసుకుంది. వైఫై, బ్లూటూత్‌ ఫీచర్లు కలిగిన సెల్‌ఫోన్‌ దిగుమతులకు సంబంధించి కీలక ప్రకటనచేసింది. ఇక నుంచి ఈ తరహా మొబైల్‌ ఫోన్ల దిగుమతికి తమ నుంచి అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని డీఓటీ మెమొరాండం జారీచేసింది. వైఫై, బ్లూటూత్‌ కలిగిన ఫోన్లు విదేశీ వాణిజ్య విధానం పరిధిలో ఉన్నట్లు వివరించింది. తాజా మెమొరాండం

భారత్‌లో మరిన్ని పెట్టుబడులు

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: నూతన ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చే దిశగా రెండో విడత 'కంట్రీ డిజిటల్ యాక్సిలరేషన్' (సీడీఏ) కార్యక్రమం కింద భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా టెక్ దిగ్గజం సిస్కో సీఈవో చక్ రాబిన్స్ తెలిపారు. దీంతో సీడీఏ కింద రెండో విడత ఇన్వెస్ట్‌మెంట్స్ అందుకున్న అతి కొద్ది దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పౌరులకు మెరుగైన సర్వీసులు అందించడంలో 5జీ టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తేవడంపైనా

Most from this category