STOCKS

News


ఎస్సార్‌ స్టీల్‌పై ఆర్సెలర్‌ మిట్టల్‌కు లైన్‌క్లియర్‌?

Saturday 9th March 2019
news_main1552115612.png-24505

న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు చేసే విషయంలో ఆర్సెలర్‌ మిట్టల్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) పచ్చజెండా ఊపింది. 2017 నుంచి ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కింది. పెద్ద ఎత్తున రుణాలను తీర్చలేక దివాలా పరిష్కార ప్రక్రియకు కిందకు వెళ్లిన ఎస్సార్‌ స్టీల్‌ను రూ.42,000 కోట్లకు కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరిస్తూ ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌ సమర్పించింది. దీనికి రుణదాతల కమిటీ సైతం ఆమోదం తెలిపింది. కొనుగోలు తర్వాత రూ.8,000 కోట్ల నిధులను ఈక్విటీ రూపంలో ఇచ్చేందుకు కూడా ఆర్సెలర్‌ మిట్టల్‌ అంగీకరించింది. అయితే, ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్లయిన రుయాలు మధ్యలో జోక్యం చేసుకుని ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌ కంటే తాము ఎక్కువే చెల్లిస్తామంటూ ముందుకు రావడం, ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడంతో అడ్డంకి ఏర్పడింది. అయితే, ఎట్టకేలకు ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. 
 



You may be interested

అమరావతితో ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌!

Saturday 9th March 2019

మరొకటి ఇండోర్‌లో... న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బెంచ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు కేం‍ద్రం ఆమోదముద్ర వేసింది. కేసుల భారం ప్రత్యేకించి ఐబీసీ (ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ) 2016  కింద వివాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఈ బెంచ్‌ల ఏర్పాటుతో కేసుల సత్వర పరిష్కారం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌

ఓలాలో 25 కోట్ల డాలర్ల హ్యుందాయ్‌ పెట్టుబడులు

Saturday 9th March 2019

-4 శాతం వాటా కొనుగోలు  -తుది దశలో డీల్‌  -ఓలా విలువ రూ.42,000 కోట్లు !  బెంగళూరు: ట్యాక్సీ అగ్రిగేటర్‌, ఓలాలో హ్యుందాయ్‌ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నదని సమాచారం. ఓలా కంపెనీలో కొంత వాటా(సుమారుగా 4 శాతం) కొనుగోలు కోసం హ్యుందాయ్‌ 25 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  పెట్టుబడి సంబంధిత చర్చలు చివరి దశలో ఉన్నాయని,  మరికొన్ని వారాల్లో డీల్‌ కుదిరే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Most from this category