STOCKS

News


పుంజులాయిడ్‌ దివాలాకు ఎన్‌సీఎల్‌టీ ఓకే!

Saturday 9th March 2019
Markets_main1552118632.png-24515

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగం కంపెనీ పుంజ్‌లాయిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది. రూ.853.83 కోట్ల రుణ బకాయిలను పుంజ్‌లాయిడ్‌ చెల్లించకపోవడంతో, ఐసీఐసీఐ బ్యాంకు ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌టీ ఢిల్లీ బెంచ్‌ అనుమతించింది. ఎన్‌సీఎల్‌టీ పూర్తి ఆదేశాల కాపీ తమకు అందాల్సి ఉందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పుంజ్‌లాయిడ్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఐసీఐసీఐ బ్యాంకు గతేడాది జూన్‌లోనే పుంజ్‌లాయిడ్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేసింది. అయితే, కంపెనీ నిర్వహణలో పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, రుణాల పునరుద్ధరణకు అనుకూలంగా ఉన్నట్టు ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు ఐసీఐసీఐ పిటిషన్‌ను వ్యతిరేకించారు. పుంజ్‌లాయిడ్‌కు సుమారు రూ.6,000 కోట్ల రుణ భారం ఉంది. ఇందులో ఐసీఐసీఐ బ్యాంకుకు రావాల్సిన మొత్తం రూ.854 కోట్లు.



You may be interested

అమెరికా మార్కెట్‌కు 5వరోజు నష్టాలే.!

Saturday 9th March 2019

ఫిబ్రవరి ఉపాధి గణాంకాలు నిరుత్సాహపరచడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్‌ నష్టంతో ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500ఇండెక్స్‌ 5.86 పాయింట్ల నష్టపోయి 4వారాల కనిష్ట స్థాయి 2,743.07 వద్ద ముగిసింది. వారం మొత్తం మీద​ఈ ఇండెక్స్‌ 2.2శాతం నష్టపోయింది. డోజోన్స్‌ ఇండెక్స్‌ 23 పాయింట్లు క్షీణించి 25,450 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సూచీ 13.32 నష్టపోయి 7,408 వద్ద  స్థిరపడ్డాయి. సూచీలకు ఇది వరుసగా 5వరోజు నష్టాల ముగింపు కావడం గమనార్హం.

సువెన్‌ చేతికి రైజింగ్‌ ఫార్మా ఆస్తులు

Saturday 9th March 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బయో ఫార్మాస్యూటికల్‌ కంపెనీ సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌... యూఎస్‌ సంస్థ ఎసిటో కార్పొరేషన్‌కు చెందిన రైజింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌తోపాటు అనుబంధ కంపెనీల ఆస్తులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.105 కోట్లు చెల్లించేందుకు సువెన్‌ అంగీకరించిందని ఎసిటో వెల్లడించింది. ఎసిటో దివాలా తీయడంతో కోర్టు ఆమోదించిన బిడ్డింగ్‌ విధానంలో ఆస్తులను విక్రయిస్తోంది. సువెన్‌ లైఫ్‌ జేవీ అయిన షోర్‌ సువెన్‌ ఫార్మా ద్వారా ఈ కొనుగోలు చేస్తోంది.

Most from this category