STOCKS

News


ఆస్తులు, అప్పుల వివరాలు చెప్పండి..

Saturday 30th March 2019
news_main1553936189.png-24883

- ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లోని 13 సంస్థలకు ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లోని 13 సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించాల్సిందిగా నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. నిర్వహణపరమైన చెల్లింపులు కొనసాగించేందుకు అనుమతులున్న సంస్థలు ఇందులో ఉన్నాయి. హజారీబాగ్ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే, జార్ఖండ్ రోడ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కంపెనీ, మొరాదాబాద్‌ బరైలీ ఎక్స్‌ప్రెస్‌వే, వెస్ట్ గుజరాత్ ఎక్స్‌ప్రెస్‌వే వివరాలు సమర్పించాలని చైర్మన్ జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ ఆదేశించింది. ఇవి జరపాల్సిన చెల్లింపులు తదితర అంశాలపై నిర్ణయాన్ని ఏప్రిల్ 8వ తేదికి వాయిదా వేసింది. ఈలోగా ఇదే కేటగిరిలోని మిగతా తొమ్మిది సంస్థల వివరాలు సిద్ధం చేయాలని సూచించింది. తదుపరి విచారణలో ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌పై మారటోరియం విధించడం మీద రిజర్వ్ బ్యాంక్ వివరణ కూడా తెలుసుకోనున్నట్లు పేర్కొంది. 
    సుమారు రూ. 90,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుంగుతున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్ కంపెనీలు పలు మార్లు డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో చెల్లింపుల సామర్ధ్యాన్ని బట్టి గ్రూప్‌లోని సంస్థలను మూడు రకాలుగా వర్గీకరించారు. రుణాలు చెల్లించగలిగే వనరులున్న సంస్థలను ఒక కేటగిరీగా (ఆకుపచ్చ వర్ణం), నిర్వహణ వ్యయాలు మాత్రమే చెల్లించగలిగే సంస్థలను ఒక విభాగంగా (ముదురు పసుపుపచ్చ వర్ణం), కనీస చెల్లింపులు కూడా జరపలేని సంస్థలను ఎరుపు రంగు కేటగిరీ కింద చేర్చారు. 



You may be interested

డిమాండ్‌ ఉన్నా.. పేలవ లాభాలే!

Saturday 30th March 2019

సిమెంట్‌ కంపెనీల క్యు4 ఫలితాలపై ఇక్రా అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి పది నెలల్లో సిమెంట్‌ విక్రయాలు బాగా జోరందుకున్నాయి. అయితే ఈ జోరు కంపెనీల లాభాదాయకతలో భారీ మార్పులు తీసుకురాకపోవచ్చని ప్రముఖ బ్రోకరింగ్‌ సంస్థ ఇక్రా అభిప్రాయపడింది. కంపెనీలు తమ వ్యయాలను కస్టమర్లకు మరలించలేకపోయాయని, అందువల్ల విక్రయాలు పెరిగినా లాభాలు ఒత్తిడిలోనే ఉంటాయని ఇక్రా సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సవ్యసాచి మజుందార్‌ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పదినెలల్లో సిమెంట్‌

ఈ వారం అప్రమత్తతే ఆయుధం

Saturday 30th March 2019

మార్కెట్‌ వీక్లీ గైడ్‌ దేశీయ మార్కెట్లు అప్‌ అండ్‌ డౌన్‌ ఊగిసలాటల అనంతరం వారాన్ని పాజిటివ్‌గా ముగించాయి. నిఫ్టీ 11600 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. ప్రస్తుతం అడ్వాన్స్‌ డిక్లైన్‌ నిష్పత్తి కూడా బుల్స్‌కు అనుకూలంగా ఉంది. క్రమంగా ఒక్కో రంగం ర్యాలీలో పాలుపంచుకునేందుకు ముందుకువస్తున్నాయి. దీంతో ఇకమీదట సూచీలు మరింత బలపడవచ్చని నిపుణుల అంచనా. మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌కు ఫిబ్రవరిలో ఏర్పడిన కనిష్ఠాలే బాటమ్‌ అవుట్‌గా ఎక్కువమంది భావిస్తున్నారు. యూఎస్‌ ఫెడ్‌ మరోమారు

Most from this category