STOCKS

News


మీ వ్యాపార విధానమేంటో చెప్పండి

Saturday 8th September 2018
news_main1536381255.png-20081

న్యూఢిల్లీ: భారత్‌లో అనుసరించబోయే వ్యాపార విధానాన్ని గురించి వివరించాలంటూ అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌, దేశీ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లను నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. సెప్టెంబర్ 29లోగా దీనిపై తగు వివరణనివ్వాలంటూ వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కు సూచించింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తు అపీల్ వేసిన వ్యాపార సంస్థల సమాఖ్య సీఏఐటీకి కూడా సూచనలు చేసింది. వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్ డీల్‌పై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ పేర్కొంది. దాదాపు 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ 77 శాతం వాటాలను వాల్‌మార్ట్ కొనుగోలు చేయడం, సీఏఐటీ ఈ డీల్‌ను వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. ఈ ఒప్పందానికి సీసీఐ అనుమతులిచ్చినప్పటికీ.. డీల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్న సీఏఐటీ వాదనల్లో బలముందని, ఈ విషయంలో విధానపరమైన జోక్యం అవసరమని పేర్కొంది. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి చట్టబద్ధంగా చెల్లించాల్సిన విత్‌హోల్డింగ్ పన్నులను కట్టేసినట్లు వాల్‌మార్ట్ వెల్లడించింది. ఆదాయం అందుకున్న వారు కాకుండా .. ఆదాయం సమకూర్చిన వారు కట్టాల్సిన పన్నును విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. ఈ పన్నులను మినహాయించుకుని.. మిగతా మొత్తాన్ని గ్రహీతకు చెల్లింపుదారు కట్టాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ విషయంలో వాల్‌మార్ట్ కట్టాల్సిన విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌ను డిపాజిట్ చేసేందుకు సెప్టెంబర్ 7 దాకా ఆదాయ పన్ను శాఖ గడువిచ్చింది. 



You may be interested

టెమాసెక్‌తో ఇన్ఫోసిస్ జట్టు

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టెమసెక్‌తో జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేసింది. ఈ జేవీ కింద టెమసెక్‌తో పాటు దాని క్లయింట్లకు ఇన్ఫోసిస్ డిజిటల్ సర్వీసులు అందించనుంది. ఇందుకోసం టెమసెక్‌ సింగపూర్ విభాగమైన ట్రస్టెడ్ సోర్స్‌తో ఇన్ఫీ టీమ్ జతకట్టనుంది. ఒప్పందం ప్రకారం జాయింట్ వెంచర్‌లో ఇన్ఫోసిస్‌కు 60 శాతం, టెమసెక్‌కు 40 శాతం వాటాలుంటాయి. సింగపూర్ కేంద్రంగా పనిచేసే టెమసెక్‌ ప్రస్తుతం

ఎస్‌ఎంఎల్‌ ఇసుజు నుంచి గ్లోబల్ సిరీస్ ట్రక్కులు

Saturday 8th September 2018

బెంగళూరు: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఎస్‌ఎంఎల్‌ ఇసుజు దక్షిణ భారతదేశ మార్కెట్‌లో అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన లారీలను శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుత భాతర లారీ పరిశ్రమకు సరిగ్గా సరిపడే విధంగా గ్లోబల్ సిరీస్ (జీఎస్‌) టక్కులను ప్రవేశపెట్టినట్లు వెల్లడించిన ఈ సంస్థ.. తమ నూతన టెక్నాలజీ ద్వారా రియల్-టైమ్ వాహన ట్రాకింగ్, వ్యయ నియంత్రణ, ఉత్తమ లోడింగ్‌ సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉన్నట్లు వివరించింది. ఈ

Most from this category