STOCKS

News


అల్ట్రాటెక్‌ చేతికి బినానీ సిమెంట్‌?

Thursday 15th November 2018
news_main1542259031.png-22034

న్యూఢిల్లీ: రుణ ఊబిలో చిక్కుకున్న బినానీ సిమెంట్‌ విషయమై ఆదిత్య బిర్లా గ్రూపు దాఖలు చేసిన సవరణ బిడ్‌కు జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆమోదం తెలిపింది. ప్రత్యర్థి దాల్మియా భారత్‌ గ్రూపు సంస్థ రాజ్‌పుతాన ప్రాపర్టీస్‌ సమర్పించిన ప్రణాళిక కొందరు రుణ దాతలకు వ్యతిరేకంగా, వివక్షాపూరితంగా ఉందని చైర్మన్‌ జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ ఆధ్వర్యంలోని ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూలై 2న బినానీ సిమెంట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ వ్యవహారాలను ఎన్‌సీఎల్‌టీ కోల్‌కతా శాఖ నుంచి అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. రోజువారీగా విచారణ కూడా చేయాలని సుప్రీంకోర్టు ఎన్‌సీఎల్‌ఏటీని ఆదేశించింది. అల్ట్రాటెక్‌ సవరణ ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ రాజ్‌పుతాన సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, రుణదాతల కమిటీ రాజ్‌పుతానా ప్రాపర్టీస్‌ సమర్పించిన రూ.6,930 కోట్ల ఆఫర్‌ను సవరించాలని కోరింది. ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అల్ట్రా టెక్‌ సిమెంట్‌ మాత్రం తొలుత రూ.7,200 కోట్లను బినానీ సిమెంట్‌కు ఆఫర్‌ చేయగా, తర్వాత ఈ మొత్తాన్ని రూ.7,900 కోట్లకు సవరించింది. 



You may be interested

ఫిన్‌టెక్ దిగ్గజంగా భారత్‌..

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: టెక్నాలజీ తోడ్పాటుతో భారత్‌లో భారీ స్థాయిలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీంతో ప్రపంచంలోనే ఫైనాన్షియల్‌ టెక్నాలజీకి (ఫిన్‌టెక్‌) సంబంధించి దిగ్గజ దేశాల్లో ఒకటిగా భారత్‌ ఎదిగిందన్నారు. స్టార్టప్‌ సంస్థలకు హబ్‌గా నిలుస్తున్న భారత్‌.. పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారిందని కూడా చెప్పారాయన. సింగపూర్‌లో జరుగుతున్న 3వ ఫిన్‌టెక్‌ సదస్సులో కీలకోపన్యాసం చేసిన మోదీ... ‘‘భారత్‌లో పాలనా స్వరూపాన్ని, ప్రజలకు అందించే సేవలను టెక్నాలజీ

తగ్గిన హైరింగ్‌ అంచనాలు ..

Thursday 15th November 2018

ముంబై: దేశీయంగా కరెన్సీ పతనం, చమురు ధరల పెరుగుదల ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాల అంచనాలు 3 శాతం మేర తగ్గి 92 శాతానికి చేరాయి. ప్రథమార్ధంలో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) ఇది 95 శాతంగా ఉంది. టీమ్‌లీజ్‌ సంస్థ రూపొందించిన 2018-19 నియామకాల అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నియామకాల సెంటిమెంటుపై 14 నగరాల్లో 19 రంగాలకు చెందిన 750 చిన్న, మధ్య తరహా,

Most from this category