STOCKS

News


భూషణ్‌ స్టీల్‌ బిడ్డింగ్‌ గడువుతేదీ పెంపు

Tuesday 7th August 2018
news_main1533619820.png-19004

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ను సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్న మూడు దిగ్గజ కంపెనీలకు మరింత సమయం లభించింది. టాటా స్టీల్‌ అభ్యర్ధన మేరకు సవరించిన (రివైజ్డ్‌) బిడ్‌ను దాఖలు చేసేందుకు గడువుతేదీని ఈనెల 13 వరకు పొడిగించినట్లు నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తెలిపింది. భూషణ్‌ స్టీల్‌ను దక్కించుకునేందుకు టాటా స్టీల్‌, లిబర్టీ హౌస్‌, జీఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సంస్థలు రేసులో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు గడువుతేదీలోపుగా సవరించిన బిడ్‌లను దాఖలు చేయడానికి అవకాశం లభించింది. ఇంతకుముందు ఆగస్టు 6 వరకు సమయం ఇవ్వగా, టాటా స్టీల్‌ ఇందుకు మరింత సమయం కోరింది. జూలై 31కి ముందు సమర్పించిన బిడ్లలో టాటా స్టీల్‌ అత్యధిక బిడ్డింగ్‌ వేయగా.. ఇప్పుడు కంపెనీలు మళ్లీ వేయనున్న సవరించిన బిడ్‌లను రుణదాతల కమిటీ (సీఓసీ) పరిగణలోనికి తీసుకుంటే రేసులో ఉన్న కంపెనీల స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో రూ.11,000 కోట్లకు బిడ్‌ను సమర్పించిన జీఎస్‌డబ్ల్యూ స్టీల్‌.. తరువాత రూ.18,000 కోట్లకు సవరించింది. టాటా స్టీల్‌ రూ.17,000 కోట్లకు బిడ్‌ సమర్పించింది. మరోవైపు భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ రుణదాతలకు రూ.45,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. కంపెనీని సొంతంచేసుకోవడం కోసం పోటీపడుతున్న మూడు కంపెనీలు, ఆపరేషనల్‌ క్రెడిటార్లు, సస్పెండైన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి, పరిష్కార మార్గం చూడమని సీఓసీని సూచించిన ఎన్‌సీఎల్‌ఏటీ.. అంతకుముందు జూలై 17న ఇచ్చిన స్టేను జూలై 20న ఎత్తివేసిన విషయం తెలిసిందే. 



You may be interested

ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ రోడ్‌మ్యాప్‌నకు కమిటీలు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ఎయిర్‌క్రాఫ్ట్‌లు, డ్రోన్ల తయారీకి కార్యాచరణను రూపొందించేందుకు ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. ఏవియేషన్‌ రంగం దేశీయంగా వేగంగా వృద్ధి చెందుతోందని, ప్రతీ రోజూ కొత్తగా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. దీంతో రానున్న సంవత్సరాల్లో వేలాది విమానాల కొనుగోళ్లకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను రెండు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకటి

బ్రిటానియా లాభం రూ.258 కోట్లు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.258 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.216 కోట్లతో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,375 కోట్ల నుంచి రూ.2,586 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ఎమ్‌డీ వరుణ్‌ బెర్రీ తెలిపారు.  గత

Most from this category