News


స్పైస్‌జెట్ దివాలా పిటీషన్‌ తిరస్కృతి

Monday 13th May 2019
Markets_main1557729409.png-25702

న్యూఢిల్లీ: నిర్వహణపరమైన రుణాలు బాకీ పడిన చౌక విమానయాన చార్జీల సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ రామ్‌కో సిస్టమ్ దాఖలు చేసిన పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) తిరస్కరించింది.  ఇలాంటి కేసుల్లో రుణాలు, డిఫాల్ట్‌కి సంబంధించిన కచ్చితమైన వివరాలు అవసరమవుతాయని, ఈ కేసులో అలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొంది. రామ్‌కో సిస్టమ్ ఇన్వాయిస్‌లకు సంబంధించి జారీ అయిన డిమాండ్ నోటీసులను స్పైస్‌జెట్‌కు పంపినట్లు గానీ లేదా స్పైస్‌జెట్ వాటిని అందుకున్నట్లు గానీ దాఖలాలేమీ లేవని తెలిపింది.



You may be interested

కరెన్సీ నోట్లను గుర్తించేందుకు మొబైల్ యాప్‌

Monday 13th May 2019

న్యూఢిల్లీ: కంటి చూపు లేని వారు కూడా దేశీ కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. దీన్ని రూపొందించేందుకు టెక్నాలజీ సంస్థల నుంచి బిడ్స్ ఆహ్వానించింది. నోట్లను మొబైల్ కెమెరా ముందు ఉంచినప్పుడు వాటి విలువను రెండు సెకన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యవధిలోనే తెలియజెప్పగలిగే విధంగా యాప్ ఉండాలని ఇందుకు సంబంధించిన ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది. వాయిస్ ఆప్షన్‌తోను,

ఐటీసీని మలిచిన శిల్పి

Monday 13th May 2019

ఇంటింటికీ ఐటీసీని చేర్చిన వైసీ దేవేశ్వర్‌ ఆయన సారథ్యంలో బహుముఖ కంపెనీగా పటిష్టం దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి ఉపాధి తొలుత చేరిన కంపెనీకే నాయకుడయ్యారు 23 ఏళ్ల పాటు చైర్మన్‌గా ఐటీసీ భారీ విస్తరణ 72వ ఏట కేన్సర్‌తో దేశాన్ని వీడి దిగంతాలకు సాధారణ ఉద్యోగిగా చేరిన ఓ వ్యక్తి తనకు ఉపాధినిచ్చిన కంపెనీకి కొత్త జీవాన్నిచ్చారు. చిన్న చెట్టును మర్రిమానును చేశారు. కేవలం సిగరెట్లను అమ్ముకునే ఓ కంపెనీని, ఆహార ఉత్పత్తులు, స్టేషనరీ, అగ్రి, తదితర

Most from this category