STOCKS

News


ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌కు షరతులతో కూడిన ఆమోదం

Tuesday 19th March 2019
news_main1552978345.png-24687

 తెలిపిన ఎన్‌సీఎల్‌టీ
-తదుపరి విచారణ ఈ నెల 27న 

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌కు ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీకి ఎన్‌సీఎల్‌టీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. దీంతో  స్వదేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న బిలియనీర్‌ లక్ష్మీ మిట్టల్‌ చిరకాల స్వప్నం సాకారం కానున్నది. దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటొమో మెటల్‌ కార్ప్‌లు రూ.42,000 కోట్ల ఆఫర్‌ను ఇచ్చాయి. ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్ల అప్పీల్‌ నేపథ్యంలో తుది ఉత్తర్వులకు లోబడి ఆర్సెలర్‌, నిప్పన్‌ల రిజల్యూషన్‌ ప్లాన్‌కు ఆమోదం ఆధారపడి ఉంటుందని ఇద్దరు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27న జరగనున్నది.



You may be interested

అనిల్‌ అంబానీకి తప్పిన ‘కారాగార’ ముప్పు

Tuesday 19th March 2019

- ఎరిక్‌సన్‌కు ఆర్‌కామ్‌  రూ.458.77 కోట్ల చెల్లింపులు - ఉన్నత న్యాయస్థానం  గడువుకు ఒకరోజు ముందు జమ న్యూఢిల్లీ: బిలియనీర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ‘కారాగార’ ముప్పు తప్పింది. అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువుకు సరిగ్గా ఒక్కరోజు ముందు స్వీడన్‌ టెలికం పరికరాల తయారీ సంస్థ-  ఎరిక్‌సన్‌కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్లను రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) చెల్లించింది. సోమవారం ఎరిక్‌సన్‌కు బకాయిలు చెల్లించినట్లు ఆర్‌కామ్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్‌ నుంచి రావాల్సిన

మైండ్‌ట్రీపై మైండ్‌గేమ్‌!!

Tuesday 19th March 2019

– పట్టు కోసం వ్యవస్థాపకుల యత్నాలు – టేకోవర్‌ కోసం ఎల్‌అండ్‌టీ వ్యూహాలు – ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటన – 1 బిలియన్‌ డాలర్లపైగా వ్యయం      ఐటీ సంస్థ మైండ్‌ట్రీ కోసం ఇటు వ్యవస్థాపకులు, అటు దిగ్గజ సంస్థ ఎల్‌అండ్‌టీ మధ్య పోరు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కంపెనీపై పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు ఇటు వ్యవస్థాపకులు ప్రయత్నిస్తుండగా..  టేకోవర్‌ చేసేందుకు అటు ఎల్‌అండ్‌టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీంతో కంపెనీ చేజారిపోకుండా కాపాడుకునేందుకు

Most from this category