STOCKS

News


రూ.50 కోట్లతో ఎన్‌సీఎల్‌ వెకా ప్లాంట్‌

Thursday 14th February 2019
Markets_main1550126288.png-24194

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎన్‌సీఎల్‌ వెకా హైదరాబాద్‌ శివారులో ప్లాంట్‌ను ప్రారంభించింది. మెదక్‌ జిల్లా ముచ్చెర్లలోని ఈ ప్లాంట్‌ను బుధవారం తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. 16.8 ఎకరాల్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 18 ఎక్స్‌ట్రూడర్‌ లైన్స్‌ ఉన్నాయని.. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో వీటి సంఖ్యను 30కి పెంచుతామని ఎన్‌సీఎల్‌ వెకా సీఈఓ అశ్విన్‌ దాట్ల తెలిపారు.
రూ.200 కోట్ల టర్నోవర్‌..
కొత్తగా ప్రారంభించిన ఈ ప్లాంట్‌ ద్వారా 450 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఈ సందర్భంగా అశ్విన్‌ తెలిపారు. 1.20 లక్షల చ.అ.ల్లోని ఈ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 వేల టన్నుల ప్రొఫైల్స్‌. ఈ ఉత్పత్తులను మన దేశంతో పాటూ మధ్య ప్రాచ్య, ఆఫ్రికా (ఎంఈఏ) మార్కెట్లలో సరఫరా చేస్తామని తెలిపారు. ఎన్‌సీఎల్‌ వెకా కంపెనీ హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీఎల్‌ గ్రూప్, జర్మనీకి చెందిన వెకా జాయింట్‌ వెంచర్‌. యూపీవీసీ విండో మార్కెట్లో ఎన్‌సీఎల్‌ వెకాకు 15 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఏటా 30 శాతం వృద్ధి రేటుతో 2018–19 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది.



You may be interested

ఈ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెరిగింది!

Thursday 14th February 2019

గతేడాది కాలంలో దాదాపు 80 కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నట్లు గణాంకాలు చూపుతున్నాయి. ఈ 80 కంపెనీల స్టాకుల్లో 62 కంపెనీల స్టాకులు ఏడాది కాలంలో సుమారు 80 శాతం పతనమయ్యాయి. కేవలం 18 స్టాకులు మాత్రమే పాజిటివ్‌ రాబడులు చూపాయి. 80 స్టాకుల్లో ఎక్కువ శాతం చిన్న, మధ్యతరహా స్టాకులే ఉన్నాయి. గతేడాది మిడ్‌క్యాప్‌ కరెక‌్షన్‌లో ఈ స్టాకులు బాగా దెబ్బతిన్నాయి. ఎఫ్‌ఐఐలు విచ్చలవిడిగా అమ్మకాలకు దిగడంతో మార్కెట్లో

10700 దిగువన స్వల్పకాలిక బేరిష్‌నెస్‌

Thursday 14th February 2019

బొనాంజ పోర్టుఫోలియో  దేశీయ సూచీలు కొంతకాలంగా స్వల్పకాలిక రేంజ్‌లోనే కదలాడుతూఉన్నాయి. ఇటీవల నిఫ్టీ అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ ఇచ్చినట్లు కనిపించినా చివరకు అది ఫాల్స్‌ బ్రేకవుట్‌గా ముగిసిపోయింది. నిఫ్టీకి 11100 పాయింట్ల వద్ద అత్యంత బలమైన నిరోధం ఎదురవుతోంది. ఈ స్థాయిని ఛేదించలేక నిఫ్టీ మరోమారు 10730 పాయింట్ల వరకు వెనుకంజ వేసింది. ప్రస్తుతం చార్టుల్లో ఇండికేటర్లు బేరిష్‌క్రాసోవర్‌ చూపుతున్నాయి. ఆప్షన్స్‌ పరంగా నిఫ్టీ 11000 వద్ద కాల్స్‌ అధికంగా ఉండగా, 10400

Most from this category