News


ఎన్‌బీఎఫ్‌సీల్లోకి పెరిగిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు

Friday 14th December 2018
news_main1544784760.png-22942

దేశీయ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై విదేశీ మదుపరులకు మక్కువ పెరిగింది. ఈ షేర్లలోకి గత ఎనిమిదినెలల తర్వాత తొలిసారి ఎఫ్‌పీఐ నిధులు ప్రవహించాయి. రెండు నెలల అమ్మకాల అనంతరం ఇటీవలే ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్లు ఆరంభించిన సంగతి తెలిసిందే. గత నెల ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో ఎఫ్‌పీఐలు 35.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.

లిక్విడిటీ పెంచేందుకు ఆర్‌బీఐ సుముఖత వ్యక్తం చేయడంతో ఎన్‌బీఎఫ్‌సీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ రంగంలోని కంపెనీలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయం చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. దీంతో పాటు కొన్ని కఠిన నిబంధనలు కూడా సడలించింది. ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ కౌంటర్లలో కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో ఈ రంగంపై మదుపరులు శీతకన్నువేశారు. తిరిగి ఇన్నాళ్లకు ఈ రంగంపై మదుపరులు మక్కువ చూపడం ఆరంభమైంది. నవంబర్‌లో ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు దాదాపు 85 కోట్ల డాలర్ల కొనుగోళ్లు చేశాయి. 
అక్టోబర్‌లో ఎన్‌బీఎఫ్‌సీ స్టాకులతో పాటు ఫార్మా, బయోటెక్‌ షేర్లపై ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెట్టాయి. ఇదే సమయంలో బ్యాంకింగ్‌ స్టాకుల్లో విదేశీ మదుపరులు అమ్మకాలకు దిగారు. వరుసగా ఐదో నెల్లో కూడా బ్యాంకు స్టాకులను ఎఫ్‌పీఐలు వదిలించుకున్నాయి. మొత్త 12 కోట్ల డాలర్ల విలువైన బ్యాంకింగ్‌ షేర్లను ఎఫ్‌పీఐలు విక్రయించాయి. బ్యాంకింగ్‌తో పాటు మెటల్‌, మైనింగ్‌ రంగాల షేర్లను కూడా ఎఫ్‌పీఐలు భారీగా విక్రయించాయి. 



You may be interested

పల్లె వాసులకు మైక్రోఫైనాన్స్‌ ‘డిజిటల్‌ టచ్‌’

Saturday 15th December 2018

దేశంలో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ఆధునికత వైపు అడుగులు వేస్తూ, అదే సమయంలో పల్లెవాసులకు మరింత సన్నిహితం అవుతున్నాయి. వారితో స్నేహపూర్వకంగా మసలుకుంటున్నాయి. ఈ వివరాలను కేపీఎంజీ ఇండియా మైక్రో ఫైనాన్స్‌ రంగంపై విడుదల చేసిన తాజా నివేదికలో తెలియజేసింది. కోల్‌కతాలో జరిగిన 4వ ఈశాన్య భారత మైక్రోఫైనాన్స్‌ సదస్సు 2018 ఇందుకు వేదికైంది. ఆర్థిక సేవలు అందే విషయంలో చివరి మెట్టులో ఉండే సామాన్యులకు చిన్న రుణాలను అందించడం ద్వారా

సరైన ధర.. అంటే?

Friday 14th December 2018

మార్కెట్లో కాస్తో కూస్తో ట్రేడింగ్‌ చేసే ప్రతిఒక్కరికీ సరైన ధర వద్ద షేర్లు కొనమనే సూచనలు తెలిసే ఉంటాయి. ప్రతి అనలిస్టూ ఇదే సలహా ఇస్తుంటారు. అసలింతకీ ఒక షేరుకు సరైన ధర అంటే ఎలా నిర్ధారిస్తారు? అనేది ప్రతిఒక్కరికీ వచ్చే సందేహం. దీన్ని తీర్చుకోవాలంటే కాస్త విపులంగా చర్చించుకోవాలి. ఒక షేరు వాల్యూ(విలువ)కు, (ప్రైస్‌)ధరకు మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు కొనుగోలు చేయాలన్నది ఈక్విటీ మార్కెట్లో సాధారణ సూత్రం. వారెన్‌

Most from this category