STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీలకు మరింత చేయూత

Thursday 27th December 2018
Markets_main1545883644.png-23252

 న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ) ప్రతినిధులు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్న ఈ రంగాల పునరుద్ధరణకు సూచనలు చేశారు. అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) అయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వరుసగా రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో, అది ఆర్థిక సేవల మార్కెట్లో ద్రవ్య లభ్యత సమస్యకు దారితీసిన విషయం తెలిసిందే. ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రధానమంత్రికి తెలియజేసినట్టు అసోచామ్‌ ప్రెసిడెంట్‌ బీకే గోయంకా చెప్పారు. ‘‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత ప్రభుత్వం పలు సానుకూల చర్యలను తీసుకుంది. అయితే, ఇవి సరిపోవని సంకేతమిస్తున్నాం. అందుకే దీన్ని ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చింది’’ అని ఆయన చెప్పారు. పరిశ్రమల ఆందోళనల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వ్యవస్థాపరంగా అతి ముఖ్యమైన ఎన్‌బీఎఫ్‌సీలను ప్రజల నుంచి డిపాజిట్ల సేకరణకు అనుమతించాలని, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు నుంచి రుణాలు పొందే అవకాశం హెచ్‌ఎఫ్‌సీలకు కల్పించాలని కంపెనీల ప్రతినిధులు ప్రధానిని కోరారు. మొత్తం రుణాల్లో వ్యక్తుల గృహ రుణాల వాటా 50 శాతానికి మించి ఉండాలన్న నిబంధనకు 2020 డిసెంబర్‌ వరకు గడువు ఇవ్వాలని కూడా కోరారు. ఇండియాబుల్స్‌ గ్రూపు చైర్మన్‌ సమీర్‌ గెహ్లాట్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ కపిల్‌ వాద్వాన్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ ఎండీ దినంత్‌ దుబాసీ తదితరులు పాల్గొన్నారు.You may be interested

31 రాత్రి విడిది రూ.11 లక్షలు

Thursday 27th December 2018

న్యూఢిల్లీ: కొత్త సంవత్సర సంబరాల నేపథ్యంలో హోటళ్లు, రిసార్ట్‌లలో ఛార్జీలకు రెక్కలొచ్చేశాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లోని హోటళ్లు టారిఫ్‌ల పండుగ చేసుకుంటున్నాయి. ఈ నెల 31వ తేదీ కోసం రాజస్థాన్‌లోని లగ్జరీ హోటళ్లు రూ.11 లక్షల వరకు వసూలు చేస్తుండడం డిమాండ్‌ను తెలియజేస్తోంది. సంపన్నులు ఖరీదైన హోటళ్లలో వేడుకలకు ఆసక్తి చూపిస్తుండడం హోటళ్లకు కలిసొస్తోంది. జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ డిసెంబర్‌ 31న సూట్‌ కోసం రూ.11,03 లక్షలను చార్జ్‌ చేస్తోంది. ఉదయ్‌పూర్‌లోని

ఆర్‌బీఐ నిల్వల నిర్వహణ ఎలా

Thursday 27th December 2018

 బిమల్‌ జలాన్‌ సారథ్యంలో కమిటీ ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న నిల్వల నిర్వహణపై (ఎకనమిక్‌ కమిటీ ఫ్రేమ్‌వర్క్‌) ఆరుగురు సభ్యుల కమిటీ  ఏర్పాటయ్యింది. బుధవారం ఆర్‌బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వం వహిస్తారు. ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి రాకేష్‌ మోహన్‌ వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు. 

Most from this category