STOCKS

News


‘అమ్రపాలి’ ప్రాజెక్టులను 36 నెలల్లో పూర్తి చేస్తాం

Wednesday 5th September 2018
news_main1536124824.png-19971

న్యూఢిల్లీ: రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న అమ్రపాలి గ్రూప్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సిద్ధమేనని సుప్రీం కోర్టుకు ప్రభుత్వ రంగ ఎన్‌బీసీసీ వెల్లడించింది. దాదాపు 15 హౌసింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 46,575 ఫ్లాట్స్‌ను 36 నెలల్లో దశల వారీగా నిర్మించి ఇవ్వగలమని... ఇందుకు దాదాపు రూ.8,500 కోట్ల నిధులు కావాలని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రతిపాదించింది. కేసును విచారిస్తున్న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యూయూ లలిత్‌ల ధర్మాసనం.. ఎన్‌బీసీసీ ప్రతిపాదనపై స్పందన తెలియజేయాల్సిందిగా అమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించింది. కాగా, ఎన్‌బీసీసీ కోరినట్లుగా అవసరమైన నిధులను సమకూరుస్తామని సుప్రీం ఎన్‌బీసీసీకి హామీ ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది. కాగా, ప్రాజెక్టుల పూర్తి, నిధుల వినియోగం విషయంలో పారదర్శకత, జవాబుదారీ కోసం అలహాబాద్‌ లేదా ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్‌బీసీసీ సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అంతక్రితం అమ్రపాలి గ్రూప్‌ను దొంగనాటకాలు ఆడొద్దంటూ హెచ్చిరించిన సుప్రీం... గ్రూప్‌నకు చెందిన 40 సంస్థల చరాస్తులు, బ్యాంక్‌ ఖాతాలన్నింటినీ అటాచ్‌ చేయాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో జరిగిన ఒక భారీ కుంభకోణంగా కోర్టు దీన్ని అభివర్ణించింది. గృహ కొనుగోలుదారులను వంచించి తీవ్రమైన మోసానికి కంపెనీ పాల్పడిందని కూడా ధర్మాసనం పేర్కొంది. పక్కదోవ పట్టించిన నిధులను నిగ్గుతేల్చేందుకు ఆడిటర్లకు పూర్తిగా సహకరించాలని... లేదంటే  కార్యాలయాన్నింటినీ సీజ్‌ చేయడంతోపాటు గ్రూప్‌ సంస్థలు, డైరెక్టర్లు, వాళ్ల భార్యలు, పిల్లల ఖాతాలన్నింటినీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసేవిధంగా ఆదేశించాల్సి ఉంటుందని కూడా సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్ టికెట్లపై 30% డిస్కౌంట్

Wednesday 5th September 2018

ముంబై: నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తాజాగా విమాన టికెట్ల చార్జీలపై 30 శాతం మేర డిస్కౌంటు ప్రకటించింది. దేశీ, విదేశీ రూట్లలో 25 లక్షల సీట్లను ఈ ఆఫర్‌లో భాగంగా విక్రయిస్తోంది. మంగళవారం ప్రారంభమైన బుకింగ్స్ ఆరు రోజుల పాటు సాగుతాయని సంస్థ తెలిపింది. అ‍న్ని మాధ్యమాల ద్వారా సెప్టెంబర్ 7 దాకా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఆ తర్వాత కంపెనీ వెబ్‌సైట్‌,

మార్కెట్లకు భారీ దాడుల ప్రమాదం

Wednesday 5th September 2018

ముంబై: ఫైనాన్షియల్‌ మార్కెట్ల తాలూకు ఆస్తులపై చాలా తక్కువ ఖర్చుతోనే భారీ స్థాయిలో దాడులు జరిపే ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా పొంచి ఉందని ఎన్‌ఎస్‌ఈ ఆందోళన వ్యక్తం చేసింది. మేథో సాధికారత, ఆవిష్కరణలపై పెట్టుబడుల ద్వారా తగిన ప్రమాణాలను నెలకొల్పాలని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో విక్రం లిమాయే అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ అనుసంధానత పెరుగుతుండడం, వ్యవస్థల సంక్లిష్టతతో భారీ స్థాయి సైబర్‌ దాడుల రిస్క్‌ ఉందని మంగళవారం ముంబైలో జరిగిన ఎన్‌ఎస్‌ఈ

Most from this category