STOCKS

News


గ్యాస్, యూరియా రేట్లకు రెక్కలు

Saturday 30th March 2019
news_main1553931559.png-24870


- 10 శాతం పెరగనున్న సహజ వాయువు రేట్లు
- ఏప్రిల్ 1 నుంచి అమలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సహజ వాయువు ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరనున్నాయి. దీంతో సీఎన్‌జీ, పైపుల ద్వారా సరఫరా చేసే వంట గ్యాస్‌ రేట్లతో పాటు యూరియా ఉత్పత్తి వ్యయాలు కూడా పెరగనున్నాయి. ఏప్రిల్‌-సెప్టెంబర్ మధ్య ఆర్నెల్ల వ్యవధికి గాను దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు రేటు మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్‌కు (ఎంఎంబీటీయూ) 3.69 డాలర్లకి చేరనుంది. ప్రస్తుతం ఇది యూనిట్‌కు 3.36 డాలర్లుగా ఉంది. మరోవైపు, సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర యూనిట్‌కు 7.67 డాలర్ల స్థాయి నుంచి 9.32 డాలర్లకు పెరగనుంది. గ్యాస్ రేట్లను పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. 2015 అక్టోబర్‌- 2016 మార్చి మధ్య కాలంలో గ్యాస్ రేటు అత్యధికంగా యూనిట్‌కు 3.82 డాలర్లుగా నమోదైంది. ధర పెంపునకు సంబంధించి ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ప్రతి ఆరు నెలలకోసారి గ్యాస్ ధరను సవరించడం సాధారణంగా జరిగేదే. అయితే, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఓఎన్‌జీసీ, రిలయన్స్‌కు మేలు..
సాధారణ౾ంగా ప్రతి ఆర్నెల్లకోసారి ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న సహజ వాయువు ధరలను సవరించడం జరుగుతుంది. మిగులు గ్యాస్ ఉన్న అమెరికా, రష్యా, కెనడా వంటి దేశాల సగటు రేట్ల ప్రాతిపదికన గ్యాస్ రేటును సవరిస్తారు. అమెరికాలోని హెన్రీ హబ్‌, బ్రిటన్‌లోని నేషనల్ బ్యాలెన్సింగ్ పాయింట్‌, అల్బెర్టా (కెనడా), రష్యాల్లో గత త్రైమాసికంలో ఉన్న సగటు రేటు ఆధారంగా దేశీయంగా గ్యాస్ ధరను లెక్కేస్తారు. ధర పెంచడం వల్ల సహజ వాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థల ఆదాయాలు పెరగనుండగా, మరోవైపు.. సహజవాయువు ముడివనరుగా తయారయ్యే ఎరువులు, పెట్రోకెమికల్స్‌, సీఎన్‌జీ, పైప్డ్‌ గ్యాస్ మొదలైనవి భారం కానున్నాయి. గ్యాస్ ధర 1 డాలరు మేర పెరిగితే వార్షికంగా ఓఎన్‌జీసీ వంటి సంస్థకు రూ. 4,000 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం భారత్ సహజ వాయువు అవసరాల్లో దాదాపు సగభాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం దేశీయంగా ఉత్పత్తయ్యే గాయ్స్‌ కన్నా రెట్టింపు రేటు చెల్లించాల్సి వస్తోంది.You may be interested

భారత కంపెనీలకు విదేశీ నిధుల బూస్ట్‌

Saturday 30th March 2019

జోరుగా ఈక్విటీల అమ్మకాలు గత నెల రోజుల్లోనే రూ.23,000 కోట్ల డీల్స్‌ ఆఫర్‌ సేల్‌, క్యూఐపీ ఆఫర్లు ప్రస్తుత ఇన్వెస్టర్లు, ప్రమోటర్ల వాటాల అమ్మకాలు ఐపీవో మార్కెట్‌కూ అనుకూల పరిస్థితులు  న్యూఢిల్లీ: విదేశీ నిధుల బలంతో దేశీయంగా లిస్టెడ్‌ కంపెనీలలో వాటాల అమ్మకాలు తిరిగి జోరందుకున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల్లోనే ఏకంగా రూ.23,000 కోట్ల మేర ఈక్విటీ అమ్మకాలు చోటు చేసుకోవడం పరిస్థితి మారిందనడానికి నిదర్శనం. కొన్ని నెలల విరామం తర్వాత ఈ స్థాయిలో డీల్స్‌

లాభాల్లో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 30th March 2019

ఎస్‌సీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి లాభంతో ముగిసింది. సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎస్‌జీఎక్స్‌)లో రాత్రి 11,702 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11680 పాయింట్లతో పోలిస్తే 22పాయింట్ల లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయంగా పరిమాణాలు, దేశీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం సెన్సెక్స్‌ 127 పాయింట్లు లాభంతో 38,673 వద్ద,

Most from this category