STOCKS

News


పేటెంటు కేసులో నాట్కో భాగస్వామికి ఊరట

Tuesday 16th October 2018
news_main1539664177.png-21181

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా కంపెనీ టెవా తయారీ కొపాగ్జోన్‌ 40 ఎంజీ పేటెంట్లు చెల్లవని యునైటెడ్‌ స్టేట్స్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ స్పష్టం చేసింది. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ డెలావర్‌ నిర్ణయాన్ని కోర్టు సమర్థించిందని ఔషధ కంపెనీ నాట్కో సోమవారం తెలిపింది. గ్లాటిరామెర్‌ ఎసిటేట్‌ ఇంజెక్షన్‌ 40 ఎంజీ విషయంలో నాట్కో ఫార్మా మార్కెటింగ్‌ భాగస్వామి అయిన మైలాన్‌ యూఎస్‌ కోర్టులో ఎదుర్కొంటున్న పేటెంటు ఉల్లంఘన కేసులు ఇంతటితో వీగిపోయాయి. కేంద్ర నాడీ మండలం సంబంధ చికిత్సలో గ్లాటిరామెర్‌ ఎసిటేట్‌ ఔషధాన్ని వాడతారు. సోమవారం బీఎస్‌ఈలో నాట్కో షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 5.57 శాతం ఎగసి రూ.717.05 వద్ద స్థిరపడింది.



You may be interested

రెండింతలైన పిట్టి లాభం

Tuesday 16th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో పిట్టి ఇంజనీరింగ్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రెండింతలకుపైగా అధికమై రూ.8 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.84 కోట్ల నుంచి రూ.175 కోట్లకు ఎగసింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 1.51 శాతం పెరిగి రూ.80.45 వద్ద స్థిరపడింది.

జడ్చర్లలో డీఎస్‌ఎం న్యూట్రిషన్‌ ప్లాంటు

Tuesday 16th October 2018

జడ్చర్ల: జంతువుల పోషకాహార విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న డీఎస్‌ఎం సంస్థ... మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జర్ల మండలంలోని పోలేపల్లి గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో తన ప్లాంటును ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని అంబార్‌లో తొలి ప్లాంటును ఏర్పాటు చేసిన ఈ సంస్థ... తన రెండో ప్లాంటును జడ్చర్లలో సోమవారం ఆరంభించింది. ఈ సందర్భంగా డీఎస్‌ఎం న్యూట్రీషియనల్‌ ప్రొడక్ట్స్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ బ్లాకెమోర్‌ మాట్లాడుతూ... యానిమల్‌ న్యూట్రిషన్‌కు సంబంధించి భారతీయుల్లో అవగాహన పెరుగుతోందని, దీంతో

Most from this category