STOCKS

News


115 శాతం పెరిగిన నాట్కో లాభం

Tuesday 6th November 2018
news_main1541480823.png-21739

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ నాట్కో ఫార్మా సెప్టెంబరు త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం కిందటేడాదితో పోలిస్తే 115 శాతం అధికమై రూ.181.6 కోట్లకు ఎగసింది. టర్నోవరు 35 శాతం పెరిగి రూ.583 కోట్లను తాకింది. ఏప్రిల్‌- సెప్టెంబరు కాలంలో రూ.1,158 కోట్ల టర్నోవరుపై రూ.362 కోట్ల నికరలాభం నమోదైంది. ఫార్ములేషన్స్‌ వ్యాపారంలో దేశీయం మార్కెట్‌తోపాటు ఎగుమతుల పరంగా మెరుగైన వృద్ధి సాధించింది. ఈ విభాగం నుంచి రూ.442 కోట్ల ఆదాయం సమకూరింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు క్రితంతో పోలిస్తే 0.81 శాతం అధికమై రూ.779.70 వద్ద స్థిరపడింది.



You may be interested

తీవ్రమైన పోటీ ఉంటే.. ఒత్తిడీ ఉంటుంది..

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: పోటీ తీవ్రంగా ఉన్న రంగాల్లో కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఎదిగే క్రమంలో ఇలాంటి సవాళ్లు సహజమేనన్నారు. ఎకానమీ వృద్ధి చెందే కొద్దీ ఒక్కో నియంత్రణ సంస్థ పోషించాల్సిన పాత్ర పరిధి కూడా విస్తృతమవుతుంటుందని ఆయన పేర్కొన్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.

త్వరలో పెన్నా సిమెంట్స్‌ ఐపీఓ

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న  పెన్నా సిమెంట్స్‌ సంస్థ త్వరలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయటంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్‌) భాగంగా కంపెనీ ప్రమోటర్‌ పీఆర్‌

Most from this category