STOCKS

News


నాట్కో ఫార్మా లాభం 93 శాతం అప్‌

Thursday 9th August 2018
news_main1533791094.png-19063

న్యూఢిల్లీ: నాట్కో ఫార్మా జూన్‌ త్రైమాసికానికి చక్కని ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ లాభం ఏకంగా 93 శాతం వృద్ధి చెంది రూ.181 కోట్లుగా నమోదైంది. విక్రయాలు పెరగడంతో కంపెనీ ఈ స్థాయి లాభాలను నమోదు చేసింది. ఆదాయం సైతం రూ.574 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో లాభం రూ.93.7 కోట్లు, ఆదాయం రూ.448 కోట్లుగా ఉండడం గమనార్హం. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. 


 



You may be interested

ఆర్‌బీఐ డైరెక్టర్‌గా స్వామినాథన్ గురుమూర్తి

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెంట్ స్వామినాథన్ గురుమూర్తిని రిజర్వ్ బ్యాంక్ బోర్డులో డైరెక్టరుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో భాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్‌తో ఆయనకు అనుబంధముంది. డీమోనిటైజేషన్‌ను గట్టిగా సమర్ధించిన వారిలో ఆయన కూడా ఒకరు. తమిళ పత్రిక తుగ్లక్‌కు గురుమూర్తి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. "నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగాలన్న ఉద్దేశంతోనే నేనెప్పుడూ ఏ ప్రైవేట్

స్వల్పంగా పెరిగిన పసిడి

Thursday 9th August 2018

అమెరికా - చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ మరింత ముదరడంతో పసిడి ధర బలపడుతోంది. అమెరికా ప్రారంభించిన ట్రేడ్‌వార్‌పై ఈసారి చైనా గట్టిగా ప్రతిఘటించింది. ఆగస్ట్‌ 23 నుంచి అమెరికా నుంచి దిగుమతయ్యే 16 బిలియన్‌ డాలర్ల కోట్ల విలువైన ఇంధన, ఉక్కు ఉ‍త్పత్తులతో పాటు, అటో, వైద్య పరికరాలపై 25 శాతం టారిఫ్‌ టారీఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇదే ఆగస్ట్‌ 23 నుంచి 16 బిలియన్‌ డాలర్ల విలువైన

Most from this category