STOCKS

News


స్విగ్గీ రూ.7000 కోట్ల సమీకరణ

Friday 21st December 2018
news_main1545369776.png-23130

బెంగళూరు: ఇటీవల ఆరంభించిన 100 కోట్ల డాలర్ల నిధుల సమీకరణను విజయవంతంగా పూర్తి చేసినట్లు దేశీయ అతిపెద్ద ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. అంటే ఇది మన కరెన్సీలో దాదాపు రూ.7వేల కోట్లు. కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులున్న నాస్పర్స్‌తో పాటు ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సమీకరించినట్లు తెలియజేసింది. ఈ సమీకరణతో కంపెనీ విలువ 3.3 బిలియన్‌ డాలర్లకు చేరినట్లయింది. అంటే దాదాపు రూ.21,200 కోట్లన్న మాట. ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే స్విగ్గీ విలువ ఇప్పటికి దాదాపు ఐదు రెట్లు పెరిగింది. గత ఫిబ్రవరిలో కంపెనీ విలువ 0.7 బిలియన్‌ డాలర్లు కాగా... జూన్‌ నాటికి 1.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. తాజా సమీకరణతో కంపెనీ బోర్డులోకి కొత్తగా టెన్‌సెంట్‌, హిల్‌హౌస్‌ క్యాపిటల్‌, వెల్లింగ్‌టన్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు రానున్నాయి. నాస్పర్స్‌తో సహా ఇప్పటికే స్విగ్గీలో పెట్టుబడులున్న డీఎస్‌టీ గ్లోబల్‌, మేషన్‌ డైయన్‌పింగ్‌, కోట్‌ మేనేజ్‌మెంట్‌ సైతం తాజా సమీకరణలో నిధులను సమకూర్చాయని స్విగ్గీ తెలిపింది. దేశీ ఫుడ్‌టెక్నాలజీ రంగంలో ఇంతవరకు చేపట్టిన అతిపెద్ద నిధుల సమీకరణ ఇదేనని వెల్లడించింది. తాము పెట్టుబడులు పెట్టినప్పటితో పోలిస్తే ప్రస్తుతం స్విగ్గీ నెలవారీ ఆర్డర్లు పది రెట్లు పెరిగాయని నాస్పర్స్‌ సీఈఓ ల్యారీ చెప్పారు. టైర్‌ 2, 3 నగరాలకు సంస్థ వేగంగా విస్తరిస్తోందన్నారు.
2018లో మూడు రౌండ్లు
ఈ ఏడాది మూడు దఫాలుగా స్విగ్గీ దాదాపు 131 కోట్ల డాలర్లను సమీకరించింది. జూన్‌లో కంపెనీ 21 కోట్ల డాలర్లను సమీకరించింది. తాజా సమీకరణలో స్విగ్గీ తొలి ఇన్వెస్టర్లలో కొందరు సెకండరీ షేర్‌ సేల్‌ జరిపారు. తాజా నిధులతో జొమాటో, ఫుడ్‌పాండా లాంటి పోటీదారులను బలంగా ఎదుర్కొనే వీలు కలుగుతుందని కంపెనీ ఆశిస్తోంది. భారత్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్స్‌ పెరుగుతున్నాయని, కొత్త కస్టమర్లను చేరేందుకు, నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు, నైపుణ్య శిక్షణకు, కొత్త విభాగాల్లోకి విస్తరించేందుకు తాజా నిధులు వెచ్చిస్తామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 1.2 లక్షల మంది యాక్టివ్‌ డెలివరీ పార్టనర్లున్నారు. దేశంలో సుమారు 50 నగరాల్లో సేవలనందిస్తోంది. స్విగ్గీ పోటీ సంస్థ జొమాటో ఈ ఏడాది 41 కోట్ల డాలర్ల నిధులను సేకరించింది.
 



You may be interested

ఇన్ఫీ సీఎఫ్‌ఓగా నీలాంజన్‌ రాయ్‌

Friday 21st December 2018

న్యూఢిల్లీ: కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారిగా (సీఎఫ్‌ఓ) నీలాంజన్‌ రాయ్‌ని నియమించినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌ గ్లోబల్‌ సీఎఫ్‌ఓగా నీలాంజన్‌ రాయ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌టెల్‌లో ఆయన దాదాపు 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అంతకుముందు యూనిలివర్‌లో సుమారు 15 ఏళ్లు పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్‌ చేసిన అనంతరం ఆయన సీఏ చేశారు. రాయ్‌కు

పెరుగుతున్న హ్యుందాయ్‌ కార్ల ధరలు

Friday 21st December 2018

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కంపెనీ కార్ల ధరలను పెంచుతోంది. అన్ని మోడళ్ల ధరలను రూ.30,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్‌ కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంతవరకైనా తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.3.89 లక్షల నుంచి రూ.26.84 లక్షల రేంజ్‌లో ధరలుండే శాంత్రో హ్యాచ్‌బాక్‌ నుంచి ఎస్‌యూవీ ట్యూసన్‌ వరకూ

Most from this category