STOCKS

News


రూ.700 కోట్లు ఇస్తా.. షరతులు వర్తిస్తాయ్‌ !

Friday 18th January 2019
news_main1547791634.png-23663

  • ఎస్‌బీఐకు జెట్‌ ఎయిర్‌వేస్ చీఫ్ నరేష్ గోయల్ లేఖ

న్యూఢిల్లీ: నిధుల కటకటతో ఇబ్బందులు పడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ ముందుకు వచ్చారు. కానీ కొన్ని షరతులకు అంగీకరిస్తేనే ఈ పెట్టుబడులు పెడతానని వెల్లడించారు.  జెట్‌ ఎయిర్‌వేస్‌లో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడంతో పాటు తన షేర్లను మొత్తాన్ని తనఖా పెట్టేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. అయితే తన వాటా 25 శాతం కంటే తగ్గకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌కు ఒక లేఖ రాశారు. జెట్‌ఎయిర్‌వేస్‌లో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న ఎతిహాద్‌ మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కఠినమైన నిబంధనలు విధిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్‌ను ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన వాటా 25 శాతం కన్నా తగ్గకుండా ఉండేలా చూడాలని, టేకోవర్‌ కోడ్‌ వర్తించకుండా చూడాలని, ఈ మేరకు సెబీ మినహాయింపు ఇవ్వాలని ఆ లేఖలో నరేశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఆయనకు 51 శాతం వాటా ఉంది. స్టాక్‌ మార్కెట్లో లిస్టైన కంపెనీలో ప్రమోటర్‌ వాటా నిర్దేశిత పరిమితికి లోబడి తగ్గితే, సెబీ టేకోవర్‌ కోడ్‌ ప్రకారం ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వాల్సి వస్తుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌, కంపెనీలో వాటాదారుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా సమంజసమైన పరిష్కారం కనుగొనాలని ఆ లేఖలో ఆయన కోరారు. కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించడానికి పరిష్కార ప్రణాళికపై కసరత్తు చేస్తున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది.



You may be interested

హెచ్‌యూఎల్‌ షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు

Friday 18th January 2019

క్యు3లో అంచనాలకు మించిన ఫలితాలు ప్రకటించిన హెచ్‌యూఎల్‌పై ఎక్కువశాతం బ్రోకరేజ్‌లు పాజటివ్‌గా ఉన్నాయి. కొన్ని సంస్థలు మాత్రం న్యూట్రల్‌ ధృక్పధం వ్యక్తం చేశాయి. 1. సీఎల్‌ఎస్‌ఏ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2010. కంపెనీ సైజుతో పోలిస్తే వాల్యూంల్లో 10 శాతం వృద్ధి సబబుగానే ఉంది. కంపెనీ రూరల్‌ డిమాండ్‌పై పాజిటివ్‌ కామెంట్స్‌ చేసింది. అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలుచేయడం(ఎగ్జిక్యూషన్‌) కంపెనీకి కీలక పాజిటివ్‌ అంశం. రాబోయే రోజుల్లో ఎర్నింగ్స్‌లో 15

సైయంట్‌ లాభం రూ.92 కోట్లు

Friday 18th January 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కంపెనీ సైయంట్‌ డిసెంబరు త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.92 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5 శాతం అధికం. ఆదాయం 20.8 శాతం పెరిగి రూ.1,187 కోట్లకు చేరింది. కంపెనీ చేతిలో నగదు నిల్వలు రూ.1,230 కోట్లు ఉన్నట్టు ప్రకటించింది.

Most from this category