5 రెట్లు పెరిగిన నాల్కో లాభం
By Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 5 రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.129 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 433 శాతం వృద్ధితో రూ.687 కోట్లకు ఎగసిందని నాల్కో పేర్కొంది. గత క్యూ1లో 19 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ1లో 36 శాతానికి ఎగసిందని నాల్కో సీఎమ్‌డీ తపన్‌కుమార్ చంద్ తెలిపారు. ఉత్పత్తి వ్యయాలు 15-20 శాతం మేర పెరిగినప్పటికీ, నిర్వహణ లాభం రెట్టింపునకు పైగా పెరిగిందని వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో అధిక ప్రీమియమ్..
2013-14 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.642 కోట్ల నికర లాభం రాగా, కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఒక్క క్వార్టర్‌లోనే రూ.687 కోట్ల నికర లాభాన్ని ఆర్జించటం గమనార్హం. అల్యూమినా ఆదాయ విభాగం చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించిందని సీఎండీ చెప్పారు. వ్యయ నియంత్రణ పైననే కాకుండా విక్రయానంతర, విక్రయానికి ముందు సర్వీసులపై కూడా దృష్టి సారించామని... దీనికి నాణ్యత కూడా తోడవడంతో అంతర్జాతీయ మార్కెట్లో అధిక ప్రీమియమ్ ధరలను సాధించగలిగామని చెప్పారు.
9 శాతం పెరిగిన అల్యూమినియమ్ ఉత్పత్తి...
గత క్యూ1లో 18.81 టన్నులుగా ఉన్న బాక్సైట్ ఉత్పత్తి ఈ క్యూ1లో 18.59 టన్నులకు తగ్గింది. అల్యూమినా హైడ్రేట్ ఉత్పత్తి 5.26 లక్షల టన్నుల నుంచి 11 శాతం వృద్ధితో 5.83 లక్షల టన్నులకు పెరిగింది. ఇక అల్యూమినియమ్ ఉత్పత్తి 1.01 లక్షల టన్నుల నుంచి 9 శాతం వృద్ధితో 1.10 లక్షల టన్నులకు పెరిగింది. నికర విద్యుదుత్పత్తి 5 శాతం పెరిగి 1.,682 మిలియన్ యూనిట్లకు చేరింది. మార్కెట్ ముగిసిన తర్వాత నాల్కో ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాల కారణంగా నాల్కో షేర్ 1.8 శాతం లాభంతో రూ.67.40 వద్ద ముగిసింది.
You may be interested
అతి తెలివి వద్దు... మీకూ ఇళ్లు లేకుండా చేస్తాం!
Thursday 9th August 2018న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ, ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్న రియల్టీ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లకు అత్యున్నత న్యాయస్థానం తీవ్ర హెచ్చరికలు చేసింది. అతితెలివి ప్రదర్శించవద్దని, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆటలాడవద్దని స్పష్టంచేసింది. అలా చేస్తే డైరెక్టర్లకూ ఇళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించింది. గ్రూప్ పెండింగ్ రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణకు మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్లర్ల ప్రతి ఒక్క ఆస్తినీ అమ్ముతామని,
బీపీసీఎల్ లాభం మూడు రెట్లు జంప్
Thursday 9th August 2018న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీపీసీఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.745 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.2,293 కోట్లకు పెరిగిందని బీపీసీఎల్ తెలిపింది. ఒక్కో షేర్ పరంగా నికర లాభం రూ.3.79 నుంచి రూ.11.66కు ఎగసిందని భారత్ పెట్రోలియమ్ కార్పొ లిమిటెడ్(బీపీసీఎల్) పేర్కొంది. టర్నోవర్ 23 శాతం వృద్ధితో