STOCKS

News


2018-19లో రూ.1,600 కోట్ల లాభం: నాల్కో 

Sunday 27th January 2019
news_main1548611248.png-23827

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.1,2000 కోట్ల ఆదాయంపై రూ.1,600 కోట్ల లాభాన్ని నమోదు చేయగలని నాల్కో పేర్కొంది. ‘‘‘‘మా టర్నోవర్‌ను ప్రస్తుతమున్న రూ.10,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచుకోవాలనే విషయమై కార్పొరేట్‌ ప్రణాళికతో ఉన్నాం. ఈ ఏడాదికి (ఆర్థిక సంవత్సరానికి) రూ.12,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయగలం’’ అని నాల్కో సీఎండీ తపన్‌కుమార్‌ చంద్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.1,600 కోట్ల లాభాన్ని నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, అల్యూమినా ఉత్పత్తిని 1 మిలియన్‌ టన్నుల మేర, అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.2 మిలియన్‌ టన్నుల మేర పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. 

 

2017-18 ఆర్థిక సంవత్సరానికి నాల్కో రూ.1,342 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన విషయం గమనార్హం. గడిచిన పదేళ్ల కాలంలో ఇదే అత్యధికం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.669 కోట్లు. అంతర్జాతీయంగా భవిష్యత్తు లోహంగా అల్యూమినియంను ప్రమోట్‌ చేసే పనిలో నాల్కో ఉందని తపన్‌కుమార్‌చంద్‌ తెలిపారు. నాల్కో అంతర్జాతీయ కంపెనీగా అవతరించాలన్న లక్ష్యం సంస్థ ప్రారంభం నుంచి ఉందని, 2015 నుంచి బాక్సైట్‌, అల్యూమినా ఉత్పత్తిలో అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ను అందుకుంటున్నట్టు చెప్పారు. ఉత్కల్‌-డి బొగ్గు గనులు ప్రారంభమైతే అల్యూమినియం ఉత్పత్తి టర్న్‌ అరౌండ్‌ అవుతుందని, అంతర్జాతీయ స్థాయికి కంపెనీ చేరుకుంటుందన్నారు. ‘‘అంతర్జాతీయంగా అతిపెద్ద సంస్థగా అవతరించాలన్న లక్ష్యం మాకుంది. విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు గాను ఖనిజ్‌ బిదేస్‌ (కబిల్‌) ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు తపన్‌కుమార్‌ చంద్‌ తెలిపారు.You may be interested

మధ్య కాలానికి మూడు జెమ్స్‌

Sunday 27th January 2019

గడిచిన రెండు వారాల్లో ఓ శ్రేణి పరిధిలో చలించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఫిబ్రవరి 1 బడ్జెట్‌ తర్వాత ఈ శ్రేణిని బ్రేక్ చేస్తుందని ఈక్విటీ99 వ్యవస్థాపకులు సుమీత్‌ బిల్‌గయాన్‌ అంచనా వ్యక్తం చేశారు. గడచిన 10-15 రోజుల్లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువగా అమ్మకాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. కొన్ని రంగాల పనితీరు క్యూ3లో బాగుండగా, ఆటో, సిమెంట్‌ రంగాల కంపెనీల పనితీరు అంచనాల కంటే తక్కువగా ఉన్నట్టు

బడ్జెట్‌ రోజు ఈ తాయిలాలు?!

Sunday 27th January 2019

మరో నాలుగు రోజుల్లో బడ్జెట్‌ కేటాయింపులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్‌ (ఓటాన్‌ అకౌంట్‌) కావడంతో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు వర్గాలను ఆకర్షించేందుకు కొన్ని ప్రకటనలు చేయవచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనాలతో ఉన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందని తాజా సర్వేలు పేర్కొన్నా, 2014తో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గుతుందని తేల్చాయి.

Most from this category