STOCKS

News


ఎన్‌పీఏగా నాగార్జున ఫెర్టిలైజర్స్‌ లోన్స్‌

Friday 21st September 2018
news_main1537504178.png-20426

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
ఎరువుల తయారీ కంపెనీ నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌) ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలోకి వెళ్లినట్టు సమాచారం. మార్చి 31 నాటికి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ మొత్తం రుణం రూ.1,450 కోట్లకుపైగా ఉందని తెలుస్తోంది. సెప్టెంబరు త్రైమాసికంలో తాజా ఎన్‌పీఏల లిస్టులో ఎన్‌ఎఫ్‌సీఎల్‌ చేరిందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మూలధనం లేకపోవడంతో మరికొంత కాలం ప్లాంటు మూసివేత కొనసాగించనున్నట్టు కంపెనీ గురువారం బీఎస్‌ఈకి వెల్లడించింది. ప్లాంటును తెరిచేందుకు కావాల్సిన నిధుల కోసం బ్యాంకులతో చర్చిస్తున్నామని తెలిపింది.



You may be interested

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మహర్ధశ!

Friday 21st September 2018

న్యూఢిల్లీ: చాలా కాలం తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌ తదితర పథకాల్లో డిపాజిట్లపై 0.30-0.40 శాతం వరకు పెంచింది. ఈ మేరకు అక్డోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి అమల్లో ఉండే వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ఇంత కాలం వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కేంద్రం... ఆర్‌బీఐ కీలక రేట్లను పెంపు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే

ఈ ఏడాది రిటైల్‌ లోన్లు 30 శాతం వృద్ధి

Friday 21st September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.12,500 కోట్ల రిటైల్‌ లోన్లు మంజూరు చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు లక్ష్యం విధించుకుంది. 2017-18తో పోలిస్తే ఇది 30 శాతం అధికమని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుప్‌ బాగ్చి తెలిపారు. బ్యాంకు ప్రతినిధులు సుజిత్‌ గంగూలీ, సిద్ధార్థ మిశ్రా, కౌశిక్‌ దత్తా, ప్రశాంత్‌ సింగ్‌, శాంతనూ సమద్దర్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘2018-19లో గృహ రుణాలు 25 శాతం

Most from this category