STOCKS

News


మై జీనియస్‌ స్టార్‌లో నైపుణ్య శిక్షణ

Saturday 26th January 2019
news_main1548490400.png-23823

- రూబిక్స్, అబాకస్, డ్రాయింగ్, హ్యాండ్‌ రైటింగ్‌ ట్రెయినింగ్‌
- ఫిబ్రవరిలో మార్కెట్లోకి యాప్‌; రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం
- హైదరాబాద్, బెంగళూరులోని వందకు పైగా స్కూళ్లతో ఒప్పందం
-  ‘స్టార్టప్‌ డైరీ’తో కంపెనీ ఫౌండర్‌ చవ్యా శివ నవ్య

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అబాకస్, క్యూబ్స్, ప్రొగ్రామింగ్‌ వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలంటే? ప్రత్యేకంగా శిక్షణ కేంద్రానికెళ్లాలి లేదా హోమ్‌ ట్రెయినర్‌ను పెట్టుకోవాలి. కాకపోతే ఇలాంటివి మెట్రోల్లోనే దొరుకుతాయి. మరి, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులైతే? ఇదే సమస్య ఒక తల్లిగా నవ్యకూ ఎదురైంది. డ్రాయింగ్‌ టీచర్‌ను వెతికే పనిలో ఏకంగా సాఫ్ట్‌స్కిల్స్‌ యాప్స్‌ను అభివృద్ధి చేసే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘ఐ-యాప్స్‌ ట్రాక్‌ సాఫ్ట్‌వేర్‌’ను ప్రారంభించేసింది. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే..
‘‘మాది అనంతపురం. బిట్స్‌ పిలానీలో బీఈ పూర్తయ్యాక... అమెరికాలోని ఎస్‌హెచ్‌యూ వర్సిటీలో ఎంబీఏ ఫైనాన్స్‌ చేశా. పలు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలొచ్చాయి. సొంతూళ్లో ఏదైనా కంపెనీ పెట్టాలన్నది నా కోరిక. ‘‘ఐదేళ్ల వయసున్న మా అబ్బాయికి డ్రాయింగ్‌ అంటే మహా ఇష్టం. నాకేమో రాదు. పోనీ, దగ్గర్లో ఇనిస్టిట్యూట్స్‌ ఉన్నాయా అంటే అదీ లేదు. డ్రాయింగ్‌ ట్రైయినింగ్‌ యాప్స్, ప్రొడక్ట్స్‌ ఆన్‌లైన్‌లో చాలా కొన్నాం. కానీ లాభం లేకుండా పోయింది. అప్పుడే అనిపించింది సబ్జెక్ట్స్‌తో పాటూ నైపుణ్య శిక్షణ ఇచ్చే ప్రొడక్ట్స్‌ మార్కెట్లో లేవని! అందుకే 2015లో రూ.20 లక్షల పెట్టుబడితో అనంతపురం కేంద్రంగా ఐయాప్స్‌ ట్రాక్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రై.లి.ను ప్రారంభించాం. 5 నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక, జిజ్ఞాసలను పెంపొందించే విద్యా సంబంధమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడమే మా కంపెనీ ప్రత్యేకత.
డ్రీమ్‌ వీఆర్‌ కళ్లద్దాలు..
ఐయాప్స్‌ ట్రాక్‌ సాఫ్ట్‌వేర్‌ నుంచి తొలి ఉత్పత్తి డ్రీమ్‌ వీర్‌ (వర్చువల్‌ రియాలిటీ). డ్రీమ్‌ వీఆర్‌ కళ్లద్దాలను 2016 నవంబర్‌లో మార్కెట్లోకి రిలీజ్‌ చేశాం. సుమారు 2 వేల యూనిట్లు విక్రయించాం. ఏ వీఆర్‌ వీడియోలనైనా సరే ఈ డ్రీమ్‌ వీఆర్‌ కళ్లద్దాల ద్వారా వీక్షించే వీలుండటమే వీటి ప్రత్యేకత. వీటి ధర రూ.2,999. ప్రస్తుతం మాకు 2–3 వేల మంది యూజర్లున్నారు. వచ్చే ఏడాది ముగిసేసరికి 50 వేల మంది యూజర్లకు, రూ.3 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలన్నది మా లక్ష్యం.
అంతర్జాతీయ స్కూళ్లతో ఒప్పందం..
ప్రస్తుతం మై జీనియస్‌ స్టార్‌ అనే అగ్‌మెంటెడ్‌ రియాలిటీ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఫిబ్రవరిలో మార్కెట్లోకి తెస్తాం. దీన్లో రూబిక్స్‌ క్యూబ్, అబాకస్, డ్రాయింగ్, హ్యాండ్‌ రైటింగ్‌ వంటి ఉత్పత్తులుంటాయి. వీటిల్లో ఏ యాప్‌నైనా సరే డౌన్‌లోడ్‌ చేసుకుని మై జీనియస్‌ ద్వారా సులువుగా నేర్చుకునే వీలుంటుందన్నమాట. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేంత వరకే ఇంటర్నెట్‌ అవసరం. తర్వాత నెట్‌ లేకున్నా యాప్‌ సేవలను అందుకోవచ్చు. ఫిబ్రవరిలో హైదరాబాద్, బెంగళూరులోని పలు అంతర్జాతీయ పాఠశాలల్లో మై జీనియస్‌ స్టార్‌ను ప్రారంభించనున్నాం. చిరెక్‌, జీ గ్రూప్‌ వంటి వందకు పైగా స్కూళ్లలో దీన్ని అందుబాటులోకి తెస్తాం. ఒక్క యాప్‌ ఇన్‌స్టలేషన్‌కు రూ.5 వేలు «చార్జీ ఉంటుంది.
రూ.4 కోట్ల నిధుల సమీకరణ..
ఇప్పటివరకు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టాం. 4 నెలల్లో ప్రోగ్రామింగ్, పజిల్, సుడొకో, మెమొరీ బూస్టర్‌ వంటి అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తెస్తాం. ‘‘ప్రస్తుతం మా కంపెనీలో 10 మంది ఉద్యోగులున్నారు. త్వరలో 25 శాతం వాటా విక్రయంతో రూ.4 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’



You may be interested

అమెరికా షట్‌డౌన్‌కు తాత్కలిక ముగింపు

Saturday 26th January 2019

అమెరికా చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న ప్రభుత్వ ‘షట్‌డౌన్‌’కు శుక్రవారం తాత్కలిక ముగింపు పడింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ కార్యకలాపాలను తాత్కలికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 35 రోజుల పాటు సాగిన ప్రభుత్వ ‘షట్‌డౌన్‌’పై అటు పార్టీ, ప్రభుత్వ, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్‌ 3వారాల వరకు ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని తాజాగా వెల్లడించారు. వచ్చే నెల 15వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైన నిధులను విడుదల

స్టార్టప్‌లను ప్రోత్సహించాలి..!

Saturday 26th January 2019

బీపీవో, కేపీవో సేవలకు పన్నుల్లో స్పష్టత అవసరం ఏంజెల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలి కేంద్రానికి ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్‌ వినతులు న్యూఢిల్లీ: బీపీవో, కేపీవో సేవలను జీఎస్టీ కింద ఇంటర్‌మీడియరీలు (మధ్యవర్తిత్వ సంస్థలు)గా పరిగణిస్తున్నందున పన్ను నిబంధనల పరంగా స్పష్టత తీసుకురావాలని ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పరిశ్రమలో వృద్ధి రేటు మందగించినప్పటికీ... 2016 ఆర్థిక సంవత్సరం నుంచి 24 బిలియన్‌డాలర్ల ఆదాయాన్ని ఈ రంగం తెచ్చిపెట్టడమే కాకుండా

Most from this category