ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం రూ.483 కోట్లు
By Sakshi

న్యూఢిల్లీ: ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.484 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.446 కోట్ల నికర లాభం సాధించామని, 9 శాతం వృద్ధి సాధించామని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ తెలిపింది. గత క్యూ2లో రూ.1,662 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,650 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ముత్తూట్ ఫైనాన్స్ షేర్ 7.1 శాతం నష్టంతో రూ.416 వద్ద ముగిసింది.
You may be interested
టాప్ 100 శక్తివంత మహిళల్లో మనవాళ్లు నలుగురు
Friday 7th December 2018న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో మన దేశానికి చెందిన నలుగురు మహిళలకు చోటు దక్కింది. హెచ్సీఎల్ ఎంటర్ప్రైజ్ రోష్ని నాడార్ మల్హోత్ర, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, హిందుస్థాన్ టైమ్స్ శోభన భర్తియ, ప్రముఖ సినీతార ప్రియాంక చోప్రా ఈ జాబితాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందితో రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ నిలిచారు.
రూ. 518 లక్షల కోట్లకు వ్యక్తిగత సంపద
Friday 7th December 2018హైదరాబాద్: వచ్చే అయిదేళ్ల వ్యవధిలో దేశీయంగా వ్యక్తుల దగ్గరుండే మొత్తం సంపద ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.518 లక్షల కోట్లకు చేరనుంది. డైరెక్ట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ ఈ సంపద వృద్ధికి తోడ్పడనున్నాయి. వచ్చే అయిదేళ్లలో ఈ రెండూ 24.41 శాతం, 21.04 శాతం మేర వృద్ధి చెందనున్నట్లు కార్వీ ప్రైవేట్ వెల్త్ సంస్థ 'ఇండియా వెల్త్ రిపోర్ట్ 2018'