STOCKS

News


రూ.300 కోట్ల వ్యక్తిగత రుణాలిస్తాం

Tuesday 10th July 2018
news_main1531238829.png-18176

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ముత్తూట్‌ ఫైనాన్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవలే వ‍్యక్తిగత రుణాల విభాగంలోకి ప్రవేశించిన ఈ సంస్థ... 2018 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రూ.30 కోట్లను కస్టమర్లకు అందించింది. అయిదేళ్లలో రూ.3,000 కోట్ల స్థాయికి ఈ విభాగాన్ని తీసుకెళతామని ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఈడీ జార్జ్‌ ఎం అలెగ్జాండర్‌ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఉద్యోగం చేస్తున్న వారికే రుణాలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తొలుత హైదరాబాద్‌లోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేశారు. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తారు. రుణమెంత వస్తుందో తెలిపే లేఖను ముత్తూట్‌ శాఖలో అయిదు నిముషాల్లో కస్టమర్‌కు ఇస్తారు. రెండు రోజుల్లో రుణం మంజూరు చేస్తారు. కస్టమర్‌ కనీస జీతం నెలకు మెట్రో నగరాల్లో రూ.20,000, ఇతర పట్టణాల్లో రూ.10,000 ఉండాలి. రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల దాకా రుణం తీసుకోవచ్చు. వడ్డీ 14- 21 శాతం ఉంటుంది. ఏడాది నుంచి అయిదేళ్ల కాల పరిమితిలో అప్పు తిరిగి చెల్లించాలి.



You may be interested

మెరుపు తగ్గిన గోల్డ్‌ ఈటీఎఫ్‌లు!

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: బంగారం ధరలు పెద్దగా పెరగకపోవటంతో గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో (ఈటీఎఫ్‌) అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో రూ.146 కోట్ల మేర బంగారం ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో బంగారం ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ 12 శాతం క్షీణించి రూ.4,567 కోట్లకు తగ్గింది. ఇది అంతకు ముందు ఏడాది జూన్‌ నాటికి రూ.5,174 కోట్లుగా

ఆగని రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరు ర్యాలీ..!

Tuesday 10th July 2018

3శాతం లాభపడిన షేరు ముంబై:- ఆయిల్‌రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరు ర్యాలీ ఆగడం లేదు. వరుసగా మూడో రోజూ రిలయన్స్‌ షేరు లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఉదయం రిలయన్స్‌ షేరు 1,002.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.78 శాతం లాభపడి రూ.1024.90ల గరిష్టస్థాయిని నమోదు చేసింది. బ్రిటిష్‌ పెట్రోలియం(బీపీ)తో ఆర్‌ఐఎల్‌ ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఇండియా గ్యాస్‌ సొల్యూషన్స్‌ ద్వారా ప్రభుత్వం చేపట్టనున్న సిటీ గ్యాస్‌

Most from this category