STOCKS

News


కేబుల్ సంస్థల్లో వాటాలపై రిలయన్స్ దృష్టి

Wednesday 17th October 2018
news_main1539750211.png-21224

న్యూఢిల్లీ: కేబుల్ టీవీ, హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పెద్ద యెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌.. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. డెన్‌ నెట్‌వర్క్స్‌, హాథ్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్ సంస్థల్లో గణనీయ వాటాలు కొనే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవి తుది దశల్లో ఉన్నాయని, బుధవారం ఈ డీల్స్‌పై ప్రకటన వెలువడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. "హాథ్‌వే కేబుల్‌ అండ్ డేటాకామ్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌లో వాటాల కొనుగోలు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థల ద్వారా జరుపుతున్న చర్చలు తుది దశల్లో ఉన్నాయి. బుధవారం వీటికి సంబంధించి డీల్స్‌ను ప్రకటించవచ్చు" అని వివరించాయి. మరోవైపు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించడంపై అక్టోబర్ 17న (బుధవారం) తమ తమ బోర్డులు సమావేశం కానున్నట్లు హాథ్‌వే, డెన్‌ నెట్‌వర్క్స్‌ సంస్థలు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేశాయి. హాథ్‌వే ప్రస్తుతం నాలుగు మెట్రోలు సహా 16 నగరాల్లో హై స్పీడ్ కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీకి సుమారు 35,000 కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ఉండగా, 8 లక్షల మంది బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఉన్నారు. ఇక 15 నగరాల్లో కార్యకలాపాలు విస్తరిస్తున్న డెన్ కేబుల్‌.. 2-3 ఏళ్లలో మొత్తం 500 నగరాల్లో సర్వీసులు అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. You may be interested

హీరో మోటోకార్ప్‌ లాభం రూ.976 కోట్లు

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఫలితాల పరంగా మెప్పించలేకపోయింది. కంపెనీ నికర లాభం 3.38 శాతం తగ్గి రూ.976.28 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా అధిక వ్యయాలు ఇందుకు కారణమయ్యాయి. అమ్మకాల ఆదాయం మాత్రం రూ.9,091 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,010 కోట్లు, ఆదాయం రూ.8,371 కోట్లుగా ఉండడం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో

వెల్త్‌ అడ్వైజర్స్‌ను కొనుగోలు చేస్తున్న ఐఐఎఫ్‌ఎల్‌

Wednesday 17th October 2018

ముంబై: చెన్నై కేంద్రంగా పెట్టుబడి సలహా, సేవలు అందించే ‘వెల్త్‌ అడ్వైజర్స్‌’ను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.235 కోట్లు వెచ్చించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ కొనుగోలుతో దక్షిణాదిన విస్తరించేందుకు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు వీలు కలుగుతుంది. ‘‘ఈ కొనుగోలు ద్వారా విక్రయాలు, ఇతర విభాగాల్లో ప్రతిభావంతులైన సిబ్బంది మాకు అందుబాటులోకి వస్తారు. దీనికి తోడు మా ఉమ్మడి కృషితో హై నెట్‌ వర్త్‌ (అధిక విలువ

Most from this category