STOCKS

News


ఎస్తోనియాలో ముకేశ్ అంబానీ జాయింట్ వెంచర్‌

Monday 5th November 2018
news_main1541394326.png-21709

టాలిన్‌/ముంబై: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా ఈ-గవర్నెన్స్‌ విభాగంపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ఎస్తోనియా ప్రభుత్వ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తావి కోట్కాతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ-గవర్నెన్స్ సంబంధ సేవలందించేందుకు దీన్ని ఉద్దేశించినట్లు ఎస్తోనియా ఆర్థిక శాఖ సహాయ మంత్రి విల్యార్‌ లుబి తెలిపారు. యూరోపియన్ యూనియన్‌లో భాగమైన తమ దేశంలో ముకేశ్ అంబానీ ఈ-రెసిడెన్సీ కూడా పొందినట్లు ఎస్తోనియా వర్గాలు తెలిపాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఎగుమతులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పూర్తి చేసినట్లు బ్రిటన్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ వెల్లడించింది. రిలయన్స్‌, అమెరికాకు చెందిన ట్రైకాన్ ఎనర్జీకి మధ్య ఇది జరిగినట్లు, భారత్‌లో ఈ తరహా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ లావాదేవీ జరగడం ఇదే ప్రథమం అని పేర్కొంది. దీనివల్ల ఎగుమతి పత్రాల ధృవీకరణ ప్రక్రియకు పట్టే సమయం వారం, పదిరోజుల నుంచి ఒక్కరోజుకి తగ్గిపోతుందని రిలయన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీకాంత్ వెంకటాచారి తెలిపారు. 



You may be interested

స్థిరంగా పసిడి ధర

Monday 5th November 2018

డాలర్‌ స్థిరమైన ర్యాలీతో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.20లకు ఔన్స్‌ పసిడి ధర 0.50డాలర్‌(అరడాలరు)స్వల్ప లాభంతో 1,233.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా సెనెట్‌లో ఉన్న 100 స్థానాల్లో 35 స్థానాలకు అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు రేపు (మంగళవారం) మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్న కారణంగా

అంతర్జాతీయ ట్రెండ్‌ ఆధారం

Monday 5th November 2018

న్యూఢిల్లీ: రూపాయి రికవరీ, చమురు ధరలు దిగిరావడం, అమెరికా-చైనా మధ్య సయోధ్యకు అవకాశాలు, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ దేశం నుంచి చమురు దిగుమతులకు భారత్‌కు అవకాశం కల్పించడం, గత వారం మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. అయితే, ఈ వారంలో అమెరికాలో జరగబోయే ఎన్నికలు, ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం వంటి అంశాల ఆధారంగా నెలకొనే అంతర్జాతీయ ట్రెండ్‌ మన మార్కెట్‌కు కీలకం కానుందని,

Most from this category