STOCKS

News


ప్రపంచ కుబేరుల్లో ముకేశ్‌ అంబానీకి 13వ స్థానం

Wednesday 6th March 2019
news_main1551849922.png-24446

  • మొదటి స్థానంలో అమెజాన్‌ ఫౌండర్‌ బెజోస్‌

న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. గతేడాదిలో 40.1 బిలియన్‌ డాలర్లు సంపదతో 19వ స్థానంలో ఉన్న ఈయన.. ఈ ఏడాదిలో 50 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రస్తుత ర్యాంక్‌కు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 106 మంది భారతీయులకు చోటు దక్కింది. వీరిలో ముకేష్‌ అంబానీ తరువాత.. విప్రో అజిమ్‌ ప్రేమ్‌జీ 36వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద 22.6 బిలియన్‌ డాలర్లు. హెచ్‌సీఎల్‌ కో-ఫౌండర్‌ శివ్‌ నాడార్‌ 82వ స్థానంలో నిలవగా.. ఆర్సెలర్‌ లక్ష్మీ మిట్టల్‌ 91వ స్థానాన్ని దక్కించుకున్నారు. వరుసగా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ బిర్లా (122), అదానీ గ్రూప్ చైర్మన్‌ గౌతమ్ అదానీ (167), భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ (244), పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకులు ఆచార్య బాల్‌కృష్ణ (365), పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్‌ అజయ్ పిరమల్ (436), బయోకాన్ ఫౌండర్‌ కిరణ్ మజుందార్ షా (617), ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణ మూర్తి (962), ఆర్‌కామ్‌ చైర్మన్ రిలయన్స్ అనిల్ అంబానీ (1349) స్థానాల్లో నిలిచారు.You may be interested

మా సుంకాలు తక్కువే

Wednesday 6th March 2019

డబ్ల్యూటీవో నిబంధనల మేరకే సుంకాలు టారిఫ్‌లు అధికంగా విధించడం లేదు అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం స్పష్టీకరణ జీఎస్‌పీ ఉపసంహరణతో పెద్ద ప్రభావం ఉండదు   న్యూఢిల్లీ: భారత్‌ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగానే భారత్‌ సుంకాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. ‘అధిక టారిఫ్‌లు విధిస్తున్నామన్న ఆరోపణలను అంగీకరించబోము. దిగుమతి సుంకాలు డబ్ల్యూటీవో నిర్దేశిత శ్రేణిలోనే ఉన్నాయి. కొన్ని

11000పైన నిఫ్టీ ప్రారంభం

Wednesday 6th March 2019

కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం అంతర్జాతీయ మార్కెట్లలలో బలహీన పరిస్థితులు నెలకొన్పప్పటికీ, దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభంతో 36,544 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11000 పైన 11,025 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసగా మూడో రోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. అమెరికాలో క్రూడాయిల్‌ ఉత్పత్తితో పాటు నిల్వలు కూడా అధికమైనట్లు గణాంకాలు వెలువడటంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు

Most from this category