STOCKS

News


ముకేశ్‌ అంబానీ ‘‘గ్లోబుల్‌ థింకర్‌’’

Thursday 17th January 2019
news_main1547698475.png-23623

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ దిగ్గజం ముకేశ్‌ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఫారిన్‌ పాలసీ పబ్లికేషన్స్‌ 2019 ఏడాదికి సంబంధించి ప్రకటించిన 100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్‌) జాబితాలో ముకేశ్‌ నిలిచారు. ఇంకా ఈ ర్యాంకింగ్స్‌లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టీన్‌ లగార్డ్‌ తదితరులున్నారు. మొత్తం 100 మందిలో కొన్ని పేర్లను మాత్రమే ప్రకటించిన ఫారిన్‌ పాలసీ... పూర్తి జాబితాను ఈ నెలల 22న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.  ‘44.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 2018లో జాక్‌ మాను వెనక్కినెట్టి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఆసియాలోనే నంబర్‌ వన్‌ అపర కుబేరుడిగా అవతరించారు. ప్రధానంగా చమురు, గ్యాస్‌, రిటైల్‌ స్టోర్ల ద్వారా ఆయన ఈ స్థాయిలో సంపదను దక్కించుకున్నారు. అయితే, కొత్తగా ప్రారంభించిన రిలయన్స్‌ జియో ద్వారా ఆయన భారత్‌ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఫేస్‌బుక్‌, గూగుల్‌లకు కూడా పోటీనిచ్చే సత్తా జియోకు ఉంది’ అని ఫారిన్‌ పాలసీ పేర్కొంది. కాగా, మొత్తం జాబితాను 10 విభాగాలుగా విభజించామని, అందులో ముకేశ్‌ అంబానీ... టాప్‌-10 టెక్నాలజీ థింకర్స్‌లో నిలిచినట్లు వెల్లడించింది. ఇంధనం, పర్యావరణానికి సంబంధించిన జాబితాలో ప్రముఖ రచయిత అమితవ్‌ ఘోష్‌కు కూడా చోటు లభించింది.



You may be interested

ప్రపంచబ్యాంక్‌ సారథిగా ఇంద్రా నూయి

Thursday 17th January 2019

- ఆమె పేరును ప్రతిపాదించిన ట్రంప్‌ కుమార్తె ఇవాంకా న్యూయార్క్‌: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌ పదవి రేసులో పెప్సీకో మాజీ సీఈవో, జన్మతః భారతీయురాలైన ఇంద్రా నూయి పేరు తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా న్యూయార్క్‌ టైమ్స్‌ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తు‍న్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమార్తె ఇవాంక, ఇంద్రా నూయి పేరును ప్రతిపాదించారు. ఇంద్రా

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 17th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యూకో బ్యాంక్‌:- నిధుల సమీకరణకు నేడు బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌:- పనర్వ్యవ్యవస్థీకరణలో భాగంగా వివిధర వ్యయ పద్ధతులు, రుణ భారం తగ్గించుకునే విధానాలు, పెట్టుబడుల సమీకరణ తదితర అంశాలపై కంపెనీ షేర్‌హోల్డర్లతో చర్చిస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- ఆర్‌హెచ్‌టీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌కు చెందిన మొత్తం

Most from this category