STOCKS

News


ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ ‘డాక్టర్‌ టర్మరిక్‌’

Thursday 29th November 2018
news_main1543469717.png-22471

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డాక్టర్‌ కాపర్‌ పేరుతో రాగి బాటిళ్ల తయారీలో ఉన్న ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ త్వరలో హెల్త్‌కేర్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. డాక్టర్‌ టర్మరిక్‌  పేరుతో తొలి ఉత్పాదనను డిసెంబరు చివరికల్లా విడుదల చేయనుంది. ఆర్గానిక్‌ పసుపు, సహజ రసాయనాలతో తయారు చేసిన ఈ పౌడర్‌ యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. మౌత్‌వాష్‌గా వాడొచ్చు. అలాగే మంచినీటిలో కలుపుకుని తాగవచ్చు. వంటల్లోనూ వినియోగించొచ్చు. పేటెంటుకు దరఖాస్తు చేశామని ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ ఎండీ కె.వి.రాజశేఖర్‌ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. ‘ఇటువంటి మౌత్‌వాష్‌ ప్రపంచంలో ఇదే తొలిసారి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రెండేళ్ల పరిశోధన అనంతరం విడుదల చేస్తున్నాం. ఎంఎస్‌ఆర్‌ కాపర్‌కు చెందిన బౌరంపేట యూనిట్లో రూ.10 కోట్లతో ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేశాం. ఇందుకోసం 100 మందిని నియమించుకుంటాం. హెల్త్‌కేర్‌ విభాగంలో వినూత్న ఉత్పత్తులతో విస్తరిస్తాం’ అని వివరించారు. 100, 200, 500 గ్రాముల ప్యాక్‌లలో రూ.200 నుంచి రూ.500 వరకు ధరలో డాక్టర్‌ టర్మరిక్‌ విక్రయించనున్నారు.



You may be interested

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్లు కొంచెం పెరిగాయ్‌!

Thursday 29th November 2018

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్థిర డిపాజిట్‌ రేట్లు వివిధ మెచ్యూరిటీలపై 10 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగి 6.80 శాతానికి చేరాయి. కోటి రూపాయల లోపు వివిధ డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకూ పెరిగిన ఈ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తెలిపింది.   పెంపు వివరాల్లోకి వెళితే... ♦ ఏడాది- రెండేళ్ల

రీచార్జ్‌ చేయకుంటే కనెక్షన్‌ కట్‌!!

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో రాకతో కకావికలమైన టెల్కో కంపెనీలు తమ ఆదాయాలను మెరుగుపర్చుకునే ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నాయి. ఫలితంగా ప్రీ–పెయిడ్‌ యూజర్ల నెత్తిన తప్పనిసరి కనీస రీచార్జ్‌ పిడుగు పడేశాయి. ఇప్పటిదాకా ఇస్తున్న  లైఫ్‌టైమ్‌ వేలిడిటీని పక్కన పెట్టి ప్రతి నెలా కచ్చితంగా నిర్దిష్ట మొత్తంలో రీచార్జ్‌ చేసుకోవాల్సిందేనని లేకపోతే సర్వీసులు డిస్‌కనెక్ట్‌ చేస్తామని ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. రీచార్జ్‌ల కోసం టెల్కో దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు 28

Most from this category