STOCKS

News


ఎస్‌బీఐ టార్గెట్‌ ధర పెంచిన మోర్గాన్‌స్టాన్లీ

Tuesday 2nd April 2019
news_main1554201780.png-24933

మంగళవారం ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ షేరు దాదాపు రెండున్నర శాతం లాభపడి రూ. 330పైన క్లోజయింది. అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తాజాగా ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను పెంచడంతో షేరు కౌంటర్లో జోరు పెరిగింది. ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను మోర్గాన్‌ స్టాన్లీ రూ. 375 నుంచి రూ. 425కు పెంచింది. దీంతో పాటు షేరుపై ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సర ఎస్‌బీఐ లోన్‌ గ్రోత్‌లో మంచి పురోగతి ఉంటుందని, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఐ) మరింత మెరుగుపడతాయని మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది. ఇదే సమయంలో క్రెడిట్‌ వ్యయాలు దిగివవస్తాయని, ఈ పరిణామాలన్నీ ఎస్‌బీఐకి కలిసివచ్చే అంశాలని తెలిపింది.

బ్యాంకు బలహీన సంస్థల బెయిల్‌అవుట్‌కు నిధులు వినియోగించాల్సివస్తే రిస్కవుతుందని హెచ్చరించింది. అయితే ఇలాంటి బెయిల్‌అవుట్‌లు మరీ అంత భారీగా ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. మోర్గాన్‌ స్టాన్లీ నివేదికతో ఎస్‌బీఐ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల్లో పయనించింది. ప్రస్తుతం షేరు ధర అప్‌ట్రెండ్‌ ఛానెల్లో పయనిస్తోందని రూ. 330ని దాటినందున త్వరలో రూ. 350ని పరిశీలించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ. 350 వద్ద షేరుకు బలమైన నిరోధం ఉంది. ఈ స్థాయిని భారీ వాల్యూంలతో దాటగలిగితే షేరు దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తుందని అంచనా. 



You may be interested

4నెలల గరిష్టానికి టాటామోటర్స్‌

Tuesday 2nd April 2019

తన అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌(జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటిస్తుందనే అంచనాలతో  టాటామోటర్స్‌ కంపెనీ షేర్లు మంగళవారం నాలుగు నెలల గరిష్టాన్ని తాకాయి. నేడు బీఎస్‌లో టాటామోటర్స్‌ షేర్లు రూ.188.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ‘‘మెరుగైన నగదు ప్రవాహం కారణంగా మార్చి 31వ తేదితో ముగిసే చివరి త్రైమాసికంలో కంపెనీ ఆశించిన స్థాయిలో ఫలితాలను ప్రకటిస్తుందని మేము ఆశిస్తున్నాము.’’ అని జేఎల్‌ఆర్‌

సెన్సెక్స్‌ మరో కొత్త రికార్డు

Tuesday 2nd April 2019

11700పైన ముగిసిన నిఫ్టీ నాలుగోరోజూ లాభాలే. స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం రికార్డు ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో  39,121.69 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 185 పాయింట్లు లాభపడి తొలిసారిగా 39వేల పైన 39,056.65 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 44 పాయింట్లు లాభపడి 11700పైన 11,713 వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న

Most from this category