News


ఎంఫసిస్‌ లాభం 37 శాతం జంప్‌

Friday 19th October 2018
news_main1539927842.png-21284

ఐటీ కంపెనీ ఎంఫసిస్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికపు (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం వార్షికంగా 37 శాతం వృద్ధి చెందింది. తన భాగస్వామి డీఎక్స్‌సీ టెక్నాలజీ అధిక రెవెన్యూ ఇందుకు ప్రధాన కారణం. ఇక కంపెనీ ఆదాయం 24.5 శాతం వృద్ధి రూ.1,948 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 36 శాతం వృద్ధితో రూ.314 కోట్లకు ఎగసింది. కంపెనీ వద్ద నగదు నిల్వలు సెప్టెంబర్‌ చివరి నాటికి రూ.2,518 కోట్లుగా ఉన్నాయి. 

క్యూ2 క్వార్టర్‌ ఫలితాలను విశ్లేషిస్తే..

♦ స్థూల ఆదాయం క్వార్టర్‌ పరంగా 6.9 శాతం, వార్షికంగా 24.5 శాతం పెరిగింది. స్థిర కరెన్సీ రూపంలో చూస్తే.. క్వార్టర్‌ పరంగా 3 శాతం, వార్షికంగా 14.8 శాతం ఎగసింది.
♦ నికర లాభం క్వార్టర్‌ పరంగా 4.9 శాతం, వార్షికంగా 37 శాతం పెరిగింది. రూ.270.9 కోట్లుగా నమోదయ్యింది. 
♦ ఈపీఎస్‌ క్వార్టర్‌ పరంగా 4.9 శాతం, వార్షికంగా 36.9 శాతం పెరిగింది. రూ.14గా రికార్డయ్యింది. 
♦ 210 మిలియన్‌ డాలర్ల విలువైన డీల్స్‌ను గెలుచుకుంది. 



You may be interested

తగ్గిన పసిడి

Friday 19th October 2018

ప్రపంచ మార్కెట్లో ఔన్సు పసిడి ధర స్థిరంగా 1,230 డాలర్ల వద్ద ట్రేడ్‌అవుతున్నప్పటికీ, శుక్రవారం ఉదయం రూపాయి మారకపు విలువ 73.46 స్థాయికి పెరిగిన నేపథ్యంలో ఇక్కడి మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.140 మేర తగ్గి, 31,932 వద్ద ట్రేడవుతోంది.   

శుక్రవారం వార్తల్లో షేర్లు

Friday 19th October 2018

ఆయా వార్తలకు అనుగుణంగా శుక్రవారంనాటి ట్రేడింగ్‌లో ప్రభావితమయ్యే షేర్లివి... ఏసీసీ: కన్సాలిడేటెడ్‌ నికరలాభం 15.2 శాతం వృద్ధితో రూ. 209 కోట్లకు, ఆదాయం 10.2 శాతం వృద్ధితో రూ. 3433 కోట్లకు పెరిగింది. మైండ్‌ట్రీ: నికరలాభం 30 శాతం జంప్‌చేసి రూ. 206 కోట్లకు పెరిగింది. ఆదాయం 7.1 శాతం పెరుగుదలతో రూ. 1755 కోట్లకు చేరింది. సైయంట్‌: నికరలాభం భారీగా 54 శాతం పెరిగి రూ. 127 కోట్లకు చేరగా, ఆదాయం 10

Most from this category