STOCKS

News


ఐటీ కంపెనీల టార్గెట్‌ ధరలు తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Tuesday 15th January 2019
news_main1547543610.png-23604

దేశీయ ఐటీ దిగ్గజాల్లో చాలా కంపెనీల టార్గెట్‌ ధరలను అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తగ్గించింది. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌మహీంద్రా, మైండ్‌ట్రీ, పెరిసిస్టెంట్‌ సిస్టమ్స్‌, హెక్సావేర్‌, ఎంఫసిస్‌ షేర్ల టార్గెట్లను కుదించినట్లు తెలిపింది. భారీ వాల్యూషన్ల కారణంగా టీసీఎస్‌, పేలవ వృద్ధి అంచనాల నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ టార్గెట్‌ ధరను తగ్గించామని వివరించింది. మరోవైపు ఇన్ఫోసిస్‌ లక్ష్యిత ధరను మాత్రం పెంచింది. రిస్కురివార్డు నిష్పత్తి ఆకర్షణీయంగా ఉన్నందునే ఇన్ఫీ టార్గెట్‌ ధరను పెంచామని తెలిపింది. 
మోర్గాన్‌స్టాన్లీ నిర్ణయాలు...
- టీసీఎస్‌ రేటింగ్‌ను ఓవర్‌ వెయిట్‌ నుంచి ఈక్వల్‌ వెయిట్‌కు తగ్గింపు. టార్గెట్‌ ధర రూ. 2260 నుంచి రూ. 1920కి కుదింపు. 
- హెచ్‌సీఎల్‌ టెక్‌ రేటింగ్‌ ఓవర్‌వెయిట్‌ నుంచి అండర్‌పెర్ఫామ్‌కు తగ్గింపు. టార్గెట్‌ ధర రూ. 1200 నుంచి రూ. 905కు తగ్గింపు.
- టెక్‌మహీంద్రా రేటింగ్‌ ఓవర్‌వెయిట్‌గా కొనసాగింపు. టార్గెట్‌ ధర మాత్రం రూ. 880 నుంచి రూ. 820కి తగ్గింపు.
- మైండ్‌ ట్రీ రేటింగ్‌ ఓవర్‌వెయిట్‌ నుంచి అండర్‌వెయిట్‌కు తగ్గింపు. టార్గెట్‌ ధర రూ. 1265 నుంచి రూ. 761కి తగ్గింపు.
- పెరిసిస్టెంట్‌ సిస్టమ్స్‌ రేటింగ్‌ ఓవర్‌వెయిట్‌ నుంచి అండర్‌వెయిట్‌కు కుదింపు. టార్గెట్‌ ధర రూ. 760 నుంచి రూ. 500కి కుదింపు. 
- సైయంట్‌ రేటింగ్‌ ఓవర్‌వెయిట్‌గా కొనసాగింపు. టార్గెట్‌ ధర రూ. 790 నుంచి రూ. 720కి కుదింపు. 
- హెక్సావేర్‌ టెక్నాలజీ రేటింగ్‌ అండర్‌వెయిట్‌గా కొనసాగింపు. టార్గెట్‌ ధర రూ. 385 నుంచి రూ. 350కి తగ్గింపు.
- ఇన్ఫోసిస్‌ రేటింగ్‌ ఈక్వల్‌ వెయిట్‌ నుంచి ఓవర్‌వెయిట్‌కు పెంపు. టార్గెట్‌ ధర రూ. 759 నుంచి రూ. 775కి పెంపు. 



You may be interested

కొత్త సీఈవో వార్తలతో యస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Tuesday 15th January 2019

బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) పదవి పోటీలో డాయిష్‌ బ్యాంకు సీఈవో రవ్నీత్‌ గిల్‌ ముందంజలో ఉన్నారనే వార్తలతో మంగళవారం యస్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేర్లు రూ.196.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుత యస్‌ బ్యాంక్‌ సీఈవో రాణా కపూర్‌ పదవీకాలం జనవరి 31న ముగియనున్న నేపథ్యంలో రవ్నీత్‌ గిల్‌తో పాటు యస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ సీనియర్‌ ప్రెసిడెంట్‌ రాజత్‌

10 లక్షల గదుల మైలురాయికి త్వరలోనే ‘ఓయో’

Tuesday 15th January 2019

2023 నాటికి 25 లక్షలు ప్రపంచంలో నంబర్‌ 1 కావడమే లక్ష్యం సంస్థ సీఈవో ఆదిత్య ఘోష్‌ కోల్‌కతా: ఆతిథ్య సేవల సంస్థ ఓయో హోటల్స్‌ అండ్‌ రూమ్స్‌ త్వరలోనే మిలియన్‌ గదుల (10 లక్షల గదులు) మార్క్‌ను చేరుకోనుందని ఆ సంస్థ సీఈవో (భారత్‌, దక్షిణాసియా) ఆదిత్య ఘోష్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణలో 4.6 లక్షల గదుల వసతి నిర్వహణ ఉంది. త్వరలోనే 10 లక్షల గదుల మార్క్‌ను చేరుకునేందుకు

Most from this category