STOCKS

News


జెట్‌ ఉద్యోగులకు జీతాల్లేవ్‌..!

Thursday 4th October 2018
news_main1538626718.png-20838

న్యూఢిల్లీ: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో మరోసారి ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయ్యాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,300 కోట్ల నష్టాలను ప్రకటించి, వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలను నమోదుచేసిన ఈ సంస్థ.. కనీసం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారింది. రూ.75వేలకు మించి జీతాలు ఉన్నటువంటి ఏ1-ఏ5, ఓ2, ఓ3 గ్రేడ్‌ ఉద్యోగులకు అక్టోబరు ఒకటిన జీతాలు అందగా.. ఎం1, ఎం2, ఈ1, ఇతర గ్రేడ్‌ల వారికి ఇంకా వేతనాలు అందలేదని వెల్లడైంది. ఈ అంశంపై సంస్థ ఉద్యోగి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా ప్రతినెలా 1వ తేదీన జీతాలు వస్తాయి. గతనెలలో మాత్రం సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, పైలెట్లు, ఇంజనీర్లను మినహాయించి.. మిగిలిన ఉద్యోగులందరికీ వేతనాన్ని సరియైన సమయానికే చెల్లించారు. అయితే, ఈసారి సెప్టెంబర్‌ వేతనాన్ని మాకు ఇప్పటికీ చెల్లించలేదు.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

విదేశాల్లో భారత్-22 ఈటీఎఫ్‌ లిస్టింగ్‌ !

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: భారత్‌-22 ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడేడ్‌ ఫండ్‌)ను ఏదైనా విదేశీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేయడం ద్వారా ఈ ఫండ్‌కు మరింత విలువ చేకూరుతుందని, విదేశీ నిధులను సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్‌-22 ఈటీఎఫ్‌ ద్వారా రెండు అంచెల్లో రూ.22,900 కోట్లు సమీకరించింది.  విదేశీ మార్కెట్లో భారత్‌ -22 లిస్టింగ్‌ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు వెల్లడించారు. విదేశీ మార్కెట్లో

సుజుకీ నుంచి 2 అధునాతన బైక్‌లు

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా భారత మార్కెట్‌లో రెండు గ్లోబల్‌ ఫ్లాగ్‌షిప్‌ బైక్‌లను విడుదలచేసింది. ఆర్‌ఎం-జెడ్‌ 250 పేరిట విడుదలైన బైక్‌ ధర రూ.7.10 లక్షలు కాగా, ఆర్‌ఎం-జెడ్‌ 450 మోడల్‌ ధర రూ.8.31 లక్షలుగా నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచ్ఛిదా మాట్లాడుతూ.. ‘గత కొంత కాలంగా భారత్‌లో ఆఫ్‌-రోడింగ్‌ విభాగానికి చెందిన బైక్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. సాహసోపేతమైన రైడింగ్‌

Most from this category