News


సెంట్రల్‌బ్యాంక్‌, ఐఓబీ మూడీస్‌ రేటింగ్‌ పెంపు

Tuesday 12th March 2019
news_main1552381892.png-24556

- బీఏ3 నుంచి బీఏ2కు అప్‌
- కేంద్ర తాజా మూలధన 
కల్పన కారణం

ముంబై: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ డిపాజిట్స్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం ఈ రేటింగ్‌ బీఏ3గా ఉంటే దీనిని బీఏ2కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు కేంద్రం తగిన తాజా మూలధనం సమకూర్చుతుండడం తమ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌కు కారణమని మూడీస్‌ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యూనియన్‌ బ్యాంక్‌లకు ఉన్న బీఏఏ3/పీ-3 రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్త్నుట్లు కూడా మూడీస్‌ వివరించింది. గత నెల్లో కేంద్రం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,200 కోట్ల తాజా మూలధనాన్ని అందించింది. ఇందులో సెంట్రల్‌ బ్యాంక్‌కు రూ. 2,560 కోట్లు లభించగా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌కు రూ.3,810  కోట్లు సమకూరాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.4,640 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌కు రూ. 4,110 కోట్లు లభించాయి. 2018 డిసెంబర్‌ నుంచి జనవరి 2019 మధ్య ఐఓబీకికి రూ.6,690 కోట్ల తాజా మూలధనం లభించగా, సెంట్రల్‌ బ్యాంక్‌కు రూ.1,680 కోట్లు దక్కాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విషయంలో ఈ మొత్తం రూ.10,090 కోట్లుగా ఉంది.



You may be interested

డిపాజిట్లకోసం బ్యాంకుల మధ్య పోటీ!

Tuesday 12th March 2019

- రుణ వృద్ధి అవకాశాల  నేపథ్యంలో ఇండియా రేటింగ్స్‌ అంచనా - ఇదే జరిగితే వడ్డీరేట్లు పెరిగే చాన్స్‌! న్యూఢిల్లీ: దేశంలో రుణ వృద్ధి అవకాశాల మెరుగుపడుతున్న నేపథ్యంలో... డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ అంచనావేస్తోంది. ఇదే జరిగితే డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపునకు ఈ పరిస్థితి దారితీస్తుందని విశ్లేషించింది. ముఖ్యంగా బల్క్‌ డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొంటుందని

‘వడ్డిం’పులు తగ్గించరేం..?

Tuesday 12th March 2019

- ఆర్‌బీఐ వరమిచ్చినా కరుణించని బ్యాంకులు - తగ్గిస్తున్నది తక్కువ... అందులోనూ జాప్యం - రుణాల కన్నా తక్కువగా డిపాజిట్ల వృద్ధి - పోస్టాఫీస్‌ పథకాలతో పోటీపడాల్సి రావటమే కారణం ముంబై: వృద్ధికి ఊతమిచ్చే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక పాలసీ రేట్లను తగ్గించినప్పటికీ .. బ్యాంకులు ఆ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో రుణ గ్రహీతలకు బదలాయించడం లేదు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది తొలినాళ్ల నుంచి రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ

Most from this category