STOCKS

News


ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రేటింగ్స్ కోత

Thursday 15th August 2019
news_main1565851991.png-27782

ముంబై: గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌ (ఐబీహెచ్) దీర్ఘకాలిక కార్పొరేట్‌ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ వెల్లడించింది. అలాగే భవిష్యత్ అంచనాలను కూడా 'స్థిర' స్థాయి నుంచి 'నెగటివ్‌' స్థాయికి తగ్గించినట్లు తెలిపింది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు.. నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఈ డౌన్‌గ్రేడ్ సూచిస్తుందని మూడీస్ పేర్కొంది. 



You may be interested

ఐసీఐసీఐ ఎఫ్‌డీల రేట్లు మారాయి...

Thursday 15th August 2019

ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు కాల వ్యవధి కలిగిన డిపాజిట్ల రేట్లలో మార్పులు చేసింది. 7-14 రోజుల డిపాజిట్లపై 4 శాతం, 15-29 రోజుల ఎఫ్‌డీలపై 4.25 శాతం, 30-45 రోజుల ఎఫ్‌డీలపై 5.25 శాతం, 46-60 రోజుల ఎఫ్‌డీపై 5.75 శాతం, 61-90 రోజుల డిపాజిట్‌పై 5.75 శాతం, 91-120 రోజుల డిపాజిట్‌పై 5.75

ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌కు రూ.119 కోట్ల నష్టాలు

Thursday 15th August 2019

న్యూఢిల్లీ:  ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ (ఐబీఆర్‌ఈఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.119 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.117 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.835 కోట్ల నుంచి రూ.869 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ, రూ.68 కోట్ల వడ్డీ భారం, రూ.98 కోట్ల అదనపు పన్ను భారం కారణంగా నికర నష్టాలు వచ్చాయని వివరించింది. ఈ ఆర్థిక

Most from this category