STOCKS

News


2019 చివర్లో పుంజుకోవచ్చు

Wednesday 3rd April 2019
news_main1554276964.png-24952

అంతర్జాతీయ ఆర్థిక రంగంపై ఐఎంఎఫ్‌
వాషింగ్టన్‌: అంతర్జాతీయ వృద్ధి 2019లో గత అంచనాల కంటే ఇంకా తగ్గొచ్చని, అయితే సంవత్సరం చివర్లో కాస్త పుంజుకోవచ్చని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డే అన్నారు. బ్రెగ్జిట్‌, అధిక రుణాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఫైనాన్షియల్‌ మార్కెట్లో అసౌకర్యాల నుంచి ప్రపంచ ఆర్థిక రంగానికి ప్రమాదం ఉందన్నారు. ఇది సున్నితమైన సమయమని, చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రపంచంలో రెండొంతుల ఆర్థిక వ్యవస్థలు మందగమనం ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించనున్నట్టు ఆమె చెప్పారు. ఈ ఏడాది జనవరిలోనే ప్రస్తుత ఏడాదితోపాటు వచ్చే ఏడాదికి ప్రపంచ జీడీపీ 3.5 శాతం స్థాయిలో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసిన విషయం గమనార్హం. అమెరికా ఫెడ్‌ సహా ప్రధాన సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఓపిక వహించడం, చైనా ఆర్థిక ఉద్దీపనలకు మళ్లడం వంటి ఆశావహ పరిస్థితులను లగార్డే ప్రస్తావించారు. ఈ విధమైన విధానపరమైన స్పందనలు ఆర్థిక పరిస్థితులను తేలిక పరిచేందుకు సాయపడ్డాయని, నిధుల ప్రవాహం వర్ధమాన దేశాలకు పెరగడంతో వాటి కరెన్సీలు డాలర్‌కు సమానంగా బలపడినట్టు ఆమె గుర్తు చేశారు. పన్నుల వ్యవస్థలను ఆధునీకరించడం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడం ద్వారా ప్రజా రుణాలు, సంపద అసమానతలను తగ్గించడం వంటి గత సూచనలను సభ్య దేశాలు ఆచరణలో పెట్టాలని సూచించారు.



You may be interested

ఆరు నెలల కనిష్టానికి తయారీ రంగ వృద్ధి

Wednesday 3rd April 2019

54.3 నుంచి 52.6కు నిక్కీ పీఎంఐ న్యూఢిల్లీ: దేశ తయారీ రంగ వృద్ధి మార్చి నెలలో ఆరు నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. తయారీ రంగ వృద్ధిని తెలియజేసే... నిక్కీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఫిబ్రవరిలో 54.3గా ఉండగా, మార్చిలో 52.6 పాయింట్లకు తగ్గింది. 50 పాయింట్లకు పైన ఉంటే దాన్ని విస్తరణగానే చూస్తారు. పెరుగుదల జోరు బలహీనపడుతున్నట్టు ఇది తెలియజేస్తోందని పీఎంఐ నివేదిక పేర్కొంది. గత

2019లో తగ్గనున్న వాణిజ్య వృద్ధి

Wednesday 3rd April 2019

2019లో మరింత తగ్గనున్న వాణిజ్య వృద్ధి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అనిశ్చితులే కారణం  ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా జెనీవా: ఉద్రిక్తతలతోపాటు ఆర్థిక అనిశ్చితుల వల్ల 2019లో క్రితం సంవత్సరంతో పోలిస్తే వాణిజ్య వృద్ధి తగ్గుముఖం పడుతుందని ప్రపంచ వాణిజ్య సం‍స్థ (డబ్ల్యూటీవో) అంచనా వేసింది. ఈ ఏడాది వాణిజ్యం 3.7 శాతం వృద్ధి చెందుతుందని గతంలో ఈ సం‍స్థ అంచనా వేయగా, దీన్ని తాజాగా 2.6 శాతానికి తగ్గించింది. ఈ మేరకు వార్షిక అంచనాలను

Most from this category