STOCKS

News


డీఆర్‌టీలో కేసు దాఖలకు ‘పరిమితి’ రెట్టింపు

Friday 7th September 2018
news_main1536296031.png-20037

న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సం‍స్థల తమ రుణ బకాయిలు రాబట్టుకునే విషయంలో డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ)లో కేసు దాఖలుకు అవసరమైన మొత్తాల పరిమితిని గురువారం కేంద్రం రూ. 20 లక్షలకు పెంచింది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటి వరకూ ఈ పరిమితి 10 లక్షలు. దీనివల్ల ఇకపై రూ.20 లక్షల పైబడిన బకాయిలను రాబట్టుకోడానికి మాత్రమే డీఆర్‌టీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆశ్రయించగలుగుతాయి. డీఆర్‌టీలో అధిక సంఖ్యలో కేసులు పేరుకుపోతుండడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.  దేశంలో ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 39 డీఆర్‌టీలు పనిచేస్తున్నాయి. 



You may be interested

ఫార్మాలో 1,000 మందికి లుపిన్‌ శిక్షణ

Friday 7th September 2018

 పనాజీ: ‘లెర్న్‌ అండ్‌ ఎర్న్‌’ కార్యక్రమంలో భాగంగా వచ్చే రెండేళ్లలో 1,000 మంది సైన్స్‌ విద్యార్ధులకు ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు లుపిన్‌ ప్రకటించింది. ప్లెస్‌ 12 (ఇంటర్‌)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు మూడేళ్ల ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ‘2011 నుంచి ఇప్పటివరకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 560 మంది విద్యార్ధులకు శిక్షణనిచ్చాం. 2020 నాటికి మరో 1,000 మంది ప్లెస్‌

నిమిషంలో డాక్టర్‌ కన్సల్టేషన్‌

Friday 7th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బెంగళూరుకు చెందిన హెల్త్‌కేర్‌ టెక్నాలజీ కంపెనీ ఎంఫైన్‌ వినూత్న సేవలను ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏమంటే నిమిషంలోపే వీడియో కాల్‌లో ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్యులను సంప్రతించవచ్చు. ఇప్పటి వరకు ఈ సంస్థ బెంగళూరులో 30 ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకుని వైద్య సేవలను అందించింది. తాజాగా హైదరాబాద్‌లో కిమ్స్‌, సన్‌షైన్‌, కిమ్స్‌ బీబీ, మ్యాక్స్‌క్యూర్‌ సుయోష, ఏస్టర్‌ ప్రైమ్‌ ఆసుపత్రులతో చేతులు కలిపి ఈ సేవల్ని

Most from this category