STOCKS

News


వచ్చే నెలలో మొబైల్ ట్రాకింగ్‌ వ్యవస్థ

Tuesday 9th July 2019
news_main1562652727.png-26920

న్యూఢిల్లీ: దొంగతనానికి గురైన లేదా పోయిన మొబైల్ ఫోన్స్‌ ఆనవాళ్లు పట్టుకునేందుకు ఉపయోగపడే ట్రాకింగ్ విధానాన్ని ఆగస్టులో అందుబాటులోకి తేవాలని టెలికం శాఖ యోచిస్తోంది. మొబైల్ ఫోన్ నుంచి సిమ్‌ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చేసినా కూడా ట్రాకింగ్ చేయగలిగేంత శక్తివంతంగా ఈ విధానం ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. సెంటర్‌ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్ టెలిమాటిక్స్‌ (సీ-డాట్‌) ఇప్పటికే ఈ టెక్నాలజీని సిద్ధం చేసిందని, ఆగస్టు నుంచి సర్వీసులు ప్రారంభం కావొచ్చని ఆయన వివరించారు. ప్రస్తుత పార్లమెంటు సెషన్ ముగిశాక .. సేవల ఆవిష్కరణ కోసం మంత్రితో టెలికం శాఖ చర్చించనుందని పేర్కొన్నారు. నకిలీ హ్యాండ్‌సెట్స్‌, మొబైల్‌ దొంగతనాల సమస్యను అరికట్టేందుకు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌ పేరిట ఏర్పాటైన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 15 కోట్లు కేటాయించింది. 

పనిచేసేదిలా...
సిమ్ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చినా కూడా చోరీకి గురైనా లేదా పోయిన ఫోను ఇతరత్రా ఏ నెట్‌వర్క్‌పైనా పనిచేయకుండా చేయగలిగేలా సీఈఐఆర్‌ టెక్నాలజీ ఉంటుంది. అన్ని మొబైల్ ఆపరేటర్ల ఐఎంఈఐ డేటాబేస్‌ను ఇది అనుసంధానిస్తుంది. ఒకరకంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న మొబైల్‌ టెర్మినల్స్‌ వివరాలను నెట్‌వర్క్ ఆపరేటర్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఒక కేంద్రీయ వ్యవస్థలా పనిచేస్తుంది. తద్వారా ఒక నెట్‌వర్క్ సేవలు అందిస్తున్న మొబైల్‌ ఫోన్స్‌ ఒకవేళ చోరీకి గురైన పక్షంలో .. మిగతా టెల్కోలు కూడా ఆ మొబైల్‌కు టెలికం సేవలు అందకుండా ఆపివేయొచ్చు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును మహారాష్ట్రలో నిర్వహించినట్లు అధికారి తెలిపారు.



You may be interested

మైండ్‌ట్రీ ప్రత్యేక సంస్థగానే కొనసాగుతుంది

Tuesday 9th July 2019

ఎల్‌అండ్‌టీ సీఈవో సుబ్రహ్మణ్యన్‌ వెల్లడి న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటికీ దాన్ని విడిగానే కొనసాగించనున్నట్లు ఇన్‌ఫ్రా దిగ్గజం ఎల్‌అండ్‌టీ సీఈవో ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ తెలిపారు. గ్రూప్‌లో భాగమైన ఐటీ సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ కార్యకలాపాలు వేర్వేరుగానే ఉన్నాయని ఆయన వివరించారు. మైండ్‌ట్రీ సిబ్బంది విషయంలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు, చేర్పులు చేసే యోచనేదీ లేదని ఆయన చెప్పారు. కార్యకలాపాలు యథాప్రకారంగానే కొనసాగుతాయని, రాబోయే

సావరిన్‌ బాండ్ల జారీపై ప్రభుత్వంతో చర్చిస్తాం!

Tuesday 9th July 2019

- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ - ఆర్థికమంత్రితో భేటీ న్యూఢిల్లీ: విదేశీ సావరిన్‌ బాండ్ల జారీపై ప్రభుత్వంపై సెంట్రల్‌ బ్యాంక్‌ చర్చిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సోమవారంనాడు పేర్కొన్నారు. 2019-20 వార్షిక బడ్జెట్‌ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.4.48 లక్షల కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2018-18లో ఈ మొత్తం 4.22 లక్షల కోట్లు. స్థూలంగా రుణ సమీకరణ గణాంకాలను చూస్తే, ఈ

Most from this category