STOCKS

News


ఆధార్ డెడ్‌లైన్ పెంచండి

Saturday 15th September 2018
news_main1536988056.png-20280

న్యూఢిల్లీ:  దరఖాస్తుదారుల ఫేస్ ఆథెంటికేషన్‌ ఫీచర్‌ను అమలు చేసేందుకు మరింత సమయం కావాలని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ (యూఐడీఏఐ)ని మొబైల్ ఆపరేటర్లు కోరారు. ఇందుకు అవసరమైన బయోమెట్రిక్ డివైజ్‌లు తయారు చేసే సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడం దీనికి కారణంగా పేర్కొన్నారు. ఫేస్‌ ఆథెంటికేషన్‌ అమలుకు డెడ్‌లైన్ సెప్టెంబర్ 15తో ముగిసిపోనున్న నేపథ్యంలో యూఐడీఏఐకి ఆపరేటర్ల ఫోరం (యాక్ట్‌) ఒక లేఖ రాసింది. దీన్ని అమలు చేయాలంటే డివైజ్‌ వ్యవస్థ అంతా సిద్ధమయ్యాక కనీసం రెండు నెలల వ్యవధి అయినా ఉండాలని, అప్పటిదాకా పెనాల్టీలు విధించరాదని కోరింది. ఈకేవైసీ ఆథెంటికేషన్ పూర్తయ్యాక.. దరఖాస్తుదారు ఫోటో  తీసుకోవడం, యూఐడీఏఐ డేటాబేస్‌లో వారి ఫోటోతో సరిపోల్చి చూసుకోవడం వంటి నిబంధనలు .. ఎలాంటి అదనపు ప్రయోజనం లేకుండా ఒకే పనిని పది సార్లు చేసినట్లవుతుందని పేర్కొంది.



You may be interested

క్యాడ్‌కు కళ్లెం... రూపాయికి జోష్‌!

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) పెరిగిపోకుండా చూడడం, పడిపోతున్న రూపాయి విలువకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర సర్కారు శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ రుణ నిబంధనలను సరళీకరించడంతోపాటు, అనవసర ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం, ఆంక్షలు విధించడం ఇందులో కీలకమైనవి.  ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక రంగ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌,

వైజాగ్‌లో చైనా సంస్థ ట్రినాసోలార్ తయారీ ప్లాంట్‌

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: చైనాకి చెందిన ట్రినా సోలార్‌ సంస్థ భారత్‌లో సౌర విద్యుత్ పరికరాల తయారీ ప్లాంటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇన్వెస్టర్లు, తయారీదారులు, డెవలపర్లతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యిన్‌ రోంగ్‌ ఫాంగ్ తెలిపారు. 3,5,10 కి.వా. సామర్ధ్యం గల ట్రినాహోమ్ సౌర ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. 2010లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ట్రినాసోలార్‌.. తమ తయారీ ప్లాంటు

Most from this category